ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ప్రపంచం దాదాపు రెండుగా చీలిపోయింది. రష్యాను వ్యతిరేకించేవారు మెజార్టీగా ఉంటే.. కొద్దిమొత్తంలో ఆ దేశానికి సపోర్ట్‌గా ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ఏకంగా ఉక్రెయిన్‌కు సహాయం కూడా చేశారు. అలాంటి ఎలన్ మస్క్‌ను రష్యా అధ్యక్షుడు ఫాలో కావడం చర్చనీయాంశం అయింది. రష్యా అధ్యక్షుడు ట్విట్టర్‌లో కేవలం 22 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో ఎలన్ మస్క్ ఒకరు. 

న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్(Elon Musk) ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్త చర్చల్లో ఉంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden)కు ట్విట్టర్‌లో కౌంటర్ ఇవ్వడం.. యుద్ధంతో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌కు సహాయం హస్తం అందించడం వంటి చర్యలతో ఆయన నిత్యం వార్తాల్లో ఉంటున్నారు. సోషల్ మీడియాలోనూ నెటిజన్ల చర్చలో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన మరో ఆసక్తికర పరిణామానికి కేంద్రంగా ఉన్నారు. ఒక వైపు ఎలన్ మస్క్ ఉక్రెయిన్‌కు సహాయం చేస్తుండగా, మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఆయనను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. రష్యా అధ్యక్షుడు అధికారిక ట్విట్టర్ ఖాతా కేవలం 22 మందిని మాత్రమే ఫాలో అవుతున్నది. అందులో ఎలన్ మస్క్ ఒకరు ఉండటం గమనార్హం.

రష్యా దాడితో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతున్నాయని, తమకు ఎలన్ మస్క్ స్టార్‌లింక్ స్టేషన్లు అందించి ఆదుకోవాలని ఉక్రెయిన్ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికి ఎలన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్ దేశానికి ఎలన్ మస్క్ స్టార్‌లింక్ స్టేషన్లు అందించి సహకరించారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ ద్వారా ఫోర్డ్, జనరల్ మోటార్స్ పెద్ద మొత్తంలో ఉద్యోగాలు సృష్టించాయని జో బైడెన్ ఇటీవలే ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు సమాధానంగా ఎలన్ మస్క్ రెస్పాండ్ అయ్యారు. ఆ రెండు కంపెనీల కంటే తమ టెస్లా కంపెనీ గణనీయంగా ఉపాధి కల్పించిందని గణాంకాలు సమర్పించారు. ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా ఉక్రెయిన్ లోని క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీశాయి ర‌ష్యాన్ బలాగాలు. ఈ క్ర‌మంలోనే ప‌వర్ గ్రిడ్‌లను, సెల్ ట‌వ‌ర్స్ ను పేల్చివేయడం ద్వారా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఆ సందర్భంలో మస్క్ స్పందించి సహాయ హస్తం అందించారు.

Scroll to load tweet…

అదే సమయంలో ఆయన రష్యా న్యూస్ సోర్స్ గురించి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రభుత్వాలు (ఉక్రెయిన్ కాదు) రష్యన్ న్యూస్ సోర్స్‌ను స్టార్‌లింక్ బ్లాక్ చేయాలని కోరాయని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కానీ, తాను ఆ పని చేయనని తెగేసి చెప్పారు. గన్‌ తనకు ఎక్కుపెట్టి తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఆ పని చేస్తానని పేరర్కొన్నారు. సంపూర్ణ వాక్‌స్వాతంత్రాన్ని గౌరవించేవాడిగా ఉంటున్నందుకు మన్నించండి అంటూ ట్వీట్ చేశారు.

ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సులువుగా అటెన్షన్ గ్రాబ్ చేస్తారు. కొత్త కోణంలో ఆయన కామెంట్లు చేస్తుంటారు. చాలా సార్లు నెటిజన్ల మెప్పు పొందుతుంటారు. అలాంటి వ్యక్తిని వ్లాదిమిర్ పుతిన్ ఫాలో అవుతున్నారు. పుతిన్ ఫాలో కావడం వెనుక ఆంతర్యం ఏమిటా? అని చర్చిస్తున్నారు. ఎలన్ మస్క్‌కు నిజంగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై వ్యతిరేకత ఉన్నదని ఒక్క ట్వీట్‌తో చెప్పలేం. ఆయన కేవలం తన కంపెనీ గురించి.. తన కంపెనీ ద్వారా కలుగుతున్న ఉద్యోగాల వివరాలను మాత్రమే బయటపెట్టారు.