Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాల‌ని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి.  అయితే, ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్.. సైనిక ఆప‌రేష‌న్ ప్ర‌క‌టించిన వెంట‌నే.. ర‌ష్యా బలగాలు ఉక్రెయిన్ పై దాడికి ప్రారంభించాయి.. ప్రస్తుతం అన్ని వైపుల నుంచి రష్యా దాడిని ప్రారంభించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే, ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్.. సైనిక ఆప‌రేష‌న్ ప్ర‌క‌టించిన వెంట‌నే.. ర‌ష్యా-బెలార‌స్ ల నుంచి ఉక్రెయిన్ పై దాడి మొద‌లైంది. బెలారస్తో ఉత్తర సరిహద్దు నుండి ట్యాంకులను పంపి, రష్యా దాడులను ప్రారంభించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా తూర్పు, దక్షిణాన ఇలా అన్ని ప్రాంతాల‌ను నుంచి ర‌ష్యా దాడిని కొన‌సాగిస్తున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురుస్తోంది. ఈ దాడిలో వందలాది మంది ఉక్రేనియన్లు మరణించార‌ని డైలీ మెయిల్ నివేదించింది. ఈ ర‌ష్యా మిలిట‌రీ ఆప‌రేష‌న్ తో ఎదురుదాడికి దిగిన ఉక్రెయిన్.. రష్యన్ జెట్‌లు, ఒక హెలికాప్టర్‌ను దేశ‌ తూర్పు ప్రాంతంలో ఖార్కివ్ సమీపంలో కాల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది.

ఇక గురువారం తెల్లవారుజామున పుతిన్ తన ప్రకటనలో రష్యా.. సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేస్తోందనీ, జనాభా ఉన్న ప్రాంతాలను కాద‌ని పేర్కొన్నారు. కానీ, అప్పటికే భారీ ప్రాణనష్టం జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దళం ఉత్తరాన ఉన్న తమ పోస్ట్‌లు రష్యన్ మరియు బెలారస్ దళాల నుండి దాడికి గురయ్యాయని పేర్కొంది. అంటే, ర‌ష్యా ఒక్క‌వైపు నుంచే కాకుండా అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్ పై దాడిని కొన‌సాగిస్తున్న‌ద‌ని ఈ ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. బెలారస్ వైపు నుంచి కొన‌సాగిన దాడికి సంబంధించిన వీడియో క్లిప్ లు వైర‌ల్ అవుతున్నాయి. కీవ్‌కు 120 మైళ్ల దూరంలో ఉన్న బెలారస్ సరిహద్దుపై కూడా రష్యా దాడి చేసిందని ఉక్రేనియన్ ప్రభుత్వ ప్రతినిధి ధృవీకరించారు. "ఉక్రెయిన్ రాష్ట్ర సరిహద్దు రష్యా మరియు బెలారస్ నుండి వచ్చిన దళాలచే దాడి చేయబడింది. ఉదయం 5 గంటలకు, ఉక్రెయిన్ రాష్ట్ర సరిహద్దు, రష్యన్ ఫెడరేషన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ ఉన్న ప్రాంతంలో, బెలారస్ మద్దతు ఉన్న రష్యన్ దళాలు దాడి చేశాయి" అని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఐరాస ఈ యుద్ధం ఆపాల‌ని ఇప్ప‌టికే ర‌ష్యాను కోరింది. దీని కోసం వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తోంది. ఇక ప్ర‌పంచంలోని అగ్ర దేశాధినేత‌లు సైతం ర‌ష్యా తీరు మార్చుకోవాల‌ని పిలుపునిస్తున్నారు. అమెరికా అయితే, ఉక్రెయిన్‌కు అండ‌గా ఉంటామ‌నీ, దీనికి పూర్తి బాధ్య‌త వ‌హించేలా ర‌ష్యాపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఉక్రెయిన్‌కు తమ మద్దతును కొనసాగిస్తామనీ, సైనిక దాడికి ప్రపంచం ముందు రష్యాను బాధ్యులను చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. ఈ యుద్ధం రష్యా ప్రేరేపిత, అన్యాయమైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. "రష్యన్ సైనిక బలగాలచే ప్రేరేపించబడుతూ.. అన్యాయమైన దాడికి గురవుతున్న ఉక్రెయిన్ ప్రజలకు తాము అండ‌గా ఉంటాం" అని బిడెన్ తెలిపారు. ఈ యుద్ధం కార‌ణంగా సంభ‌వించే మ‌ర‌ణాలు, విధ్వంసానికి రష్యా మాత్రమే బాధ్యత వహిస్తుందనీ, యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలు, భాగస్వాములు ఐక్యంగా ఉండి.. నిర్ణయాత్మక మార్గంలో ప్రతిస్పందిస్తాయ‌నీ, ప్రపంచం ముందు రష్యాను జవాబుదారీగా ఉంచుతుంద‌ని బైడెన్ పేర్కొన్నారు.