Russia Ukraine Crisis: యుద్ధం కారణంగా ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా రెండు దేశాలకు భారీ ఎత్తున్న ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అయితే, ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని హెచ్చరిస్తున్నా రష్యా వెనక్కి తగ్గకపోవడంతో... దానిపై విధిస్తున్న ఆంక్షలు అధికం అవుతూనే ఉన్నాయి.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా సైతం వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకుంటూ... తనపై ఆంక్షలు విధించిన దేశాలపై రష్యాలో కార్యకలాపాలు నిర్వహణపై ఆంక్షలు విధిస్తోంది.
అయితే, ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడుతోంది. ఆ క్రమంలోనే ఆ దేశంపై ఆంక్షలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా మారింది. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ఆపకుండా ఇలాగే ముందుకు సాగితే మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని పలు ప్రపంచ దేశాలు యోచిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా, రష్యా ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా మారిందని న్యూయార్క్‌కు చెందిన ఆంక్షల వాచ్‌లిస్ట్ సైట్ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు ఉక్రేనియన్ తిరుగుబాటు ప్రాంతాలైన డొనెట్స్క్ మరియు లుహాన్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 22న రష్యాపై US మరియు దాని మిత్రదేశాలు మొదట ఆంక్షలు విధించాయని Castellum.AI తెలిపింది.
ఇవేవి పట్టించుకోని రష్యా.. ఉక్రెయిన్ పై మిలిటరీ చర్యకు దిగుతున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించింది. దీంతో అమెరికా మిత్ర దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలను పెంచాయి. ప్రపంచంలోని వందలాది దేశాలు వీటిని అనుసరిస్తూ.. రష్యాపై ఆంక్షలు విధించాయి. ఫిబ్రవరి 22కి ముందు రష్యాపై 2,754 ఆంక్షలు అమల్లో ఉన్నాయని, ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించిన తర్వాత రోజుల్లో 2,778 అదనపు ఆంక్షలు విధించాయని తెలిపింది. దీంతో రష్యాపై విధించిన మొత్తం ఆంక్షలు 5,532 కు చేరుకున్నాయని Castellum.AI పేర్కొంది.
ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధిక ఆంక్షలు అనుభవిస్తున్న దేశాలను రష్యా అధిగమించింది. ఇప్పటివరకు అత్యధిక ఆంక్షలతో ప్రపంచంలోనే టాప్ లో ఉన్న ఇరాన్ (3,616 ఆంక్షలు) ను అధిగమించిందని Castellum.AI పేర్కొంది. ఈ సైట్ పేర్కొన్న వివరాల ప్రకారం.. రష్యాపై అత్యధికంగా ఆంక్షలు విధించిన దేశాలను గమనిస్తే.. స్విట్జర్లాండ్ (568), యూరోపియన్ యూనియన్ (518), కెనడా (454), ఆస్ట్రేలియా (413), US (243), UK (35), జపాన్ ( 35) దేశాలు అత్యధికంగా ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్‌పై దాడిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.
