Russia Ukraine Crisis: ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఆపడానికి ఇరు దేశాల మధ్య ఇప్పటికి వరకు 3 సార్లు శాంతి చర్యలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో భాగంగా.. యుద్ద భూమిలో ఉన్న అమాయకమైన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి హ్యుమన్ కారిడార్లు ఏర్పాటు ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. కారిడార్ల ద్వారా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి రష్యా ఒప్పందంలో భాగంగా.. కాల్పుల విరమణను ప్రకటించింది.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం13 వ రోజుకు చేరుకుంది. యుద్దం ప్రారంభించిన నాటి నుంచి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ నగరాలను ధ్వంసం చేస్తునే ఉన్నాయి. యుద్దాన్ని నిలిపివేయాలని ప్రపంచ దేశాలు రష్యాను కోరినా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోజురోజుకు ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రం చేస్తున్నాయి రష్యాన్ సైన్యాలు.. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలను భేకరత్ చేసింది. రష్యా తలవంచేందుకు సిద్ధంగా లేకుంటే. మరోవైపు ఇలాంటి దాడితో చాలా దేశాలు రష్యాకు దూరమయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా రష్యా కాల్పుల విరమణను ప్రకటించింది. పౌరుల తరలింపు కోసం ఉక్రెయిన్‌లో బుధవారం ఉదయం మానవతావాద కాల్పుల విరమణను రష్యా ప్రకటించిందని రష్యా వార్తా సంస్థలు నివేదించాయి. బుధవారం (మార్చి 9, 2022) ఉదయం 10:00 MSK (07:00 GMT) నుండి.. ఉక్రెయిన్ ల్లో కాల్పుల విరమణ చేసినట్టు ప్రకటించింది రష్యన్ ఫెడరేషన్. ఈ సమయాన్ని నిశ్శబ్ద కాలం గా అభివర్ణించింది.
శాంతి చర్చల్లో భాగంగా.. ఇరు దేశాలు ఒక్క ఒప్పందానికి వచ్చాయి. అదే.. యుద్ద భూమిలో చిక్కుకుపోయిన సాధారణ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి హుమన్ కారిడర్ల ఏర్పాటు ఒప్పుకున్నాయి. అయితే కైవ్ మరియు మాస్కో రెండూ వైఫల్యాలకు ఇతర వైపు నిందించడంతో ఇటీవలి రోజుల్లో మారియుపోల్ ఓడరేవు పట్టణం నుండి తరలింపు ప్రయత్నాలు అనేక సందర్భాల్లో విఫలమయ్యాయి.
ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన 694 మంది భారత విద్యార్థుల్ని తరలించినట్లు మంగళవారం కేంద్రం వెల్లడించింది. సుమీలో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో భాగంగానే వారిని బస్సుల్లో పోల్తావాకు తరలిస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ వెల్లడించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నట్లు సమాచారం.
3 లక్షల మందిని బంధించారు: ఉక్రెయిన్
మరియుపోల్‌లో దాదాపు మూడు లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా సేనలు బందీలుగా ఉంచాయని ఉక్రెయిన్ విదేశాంగమంత్రి దిమిట్రో కులేబా ఆరోపించారు. రష్యా యుద్ధంలో 400 మంది వరకూ ఉక్రెయిన్ పౌరులు మరణించారని, ఇందులో 38 మంది పిల్లలు ఉన్నారని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది.
