Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. సైన్య ర‌హితంగా చేసేంత వ‌ర‌కు ఈ దాడి కొన‌సాగుతుంద‌ని పేర్కొంటోంది. ప్ర‌స్తుతం యుద్ధ ప‌రిస్థితుల‌పై ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లోని దాదాపు అన్ని ప్రధాన సైనిక స్థావ‌రాల‌ను నాశ‌నం చేసిన‌ట్టు వెల్ల‌డించారు.  

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. సైన్య ర‌హితంగా చేసేంత వ‌ర‌కు ఈ దాడి కొన‌సాగుతుంద‌ని పేర్కొంటోంది. ప్ర‌స్తుతం యుద్ధ ప‌రిస్థితుల‌పై ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లోని దాదాపు అన్ని సైనిక స్థావ‌రాల‌ను నాశ‌నం చేసిన‌ట్టు వెల్ల‌డించారు. ఆయుధ గిడ్డంగులు, మందుగుండు సామగ్రి డిపోలు, విమానయానం మరియు వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా ఉక్రెయిన్ కు చెందిన ప్రధాన సైనిక మౌలిక సదుపాయాలను నాశనం చేసే సైనిక మిటిట‌రీ మిషన్ ను రష్యా ఆచరణాత్మకంగా పూర్తి చేసిందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. " రష్యన్ దళాలు తమకు కేటాయించిన అన్ని పనులను పూర్తి చేస్తాయి.. ఉక్రెయిన్‌లో ఆపరేషన్ ప్రణాళిక మరియు షెడ్యూల్‌కు అనుగుణంగా కొనసాగుతోంది" అని పుతిన్ వెల్ల‌డించారు. 

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి నేప‌థ్యంలో చాలా దేశాలు ఆ దేశ తీరుపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ.. పుతిన్ న‌డుచుకుంటున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఆంక్ష‌లు, ఆర్థిక ప‌రిస్థితి సంక్షోభం వంటి ప‌రిస్థితుల‌పై మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాలు తీరును త‌ప్పుబ‌ట్టారు. ఆ దేశాల ఆంక్ష‌లు స‌రికాద‌ని అన్నారు. అలాగే, రష్యాలో అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించడం కష్టమైన నిర్ణయం అనీ, అయితే రష్యాకు ఖచ్చితంగా నిజమైన బెదిరింపులు ఉన్నాయని అధ్యక్షుడు పుతిన్ చెప్పారు.

ఉక్రెయిన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో చేరితే, మొత్తం మిలటరీ కూటమి కీవ్‌కు సైనికంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఉక్రెయిన్ క్రిమియాలోకి ప్రవేశించవచ్చు, ఇది రష్యా మరియు నాటో మధ్య ప్రత్యక్ష ఘర్షణలకు దారితీయవచ్చు అని పుతిన్ హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చ‌ర్య‌కు సంబంధించి.. కీవ్ తో చ‌ర్చ‌ల‌కు సంబంధించి అనేక విభిన్న ఎంపిక‌లు ఉన్నాయ‌ని తెలిపారు. 

కాగా, ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. ర‌ష్యా మ‌రింత దూకుడుగా ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్ప‌టికీ ర‌ష్యా ఏమాత్రం ప‌ట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు మార్లు ఆ దేశ నేత‌లు అణుబాంబు దాడులు గురించి ప్ర‌స్తావించ‌డం ఉక్రెయిన్ తో పాటు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ పై అనేక దేశాలు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ర‌ష్యా సైతం వెన‌క్కి త‌గ్గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటూ... త‌న‌పై ఆంక్ష‌లు విధించిన దేశాల‌పై ర‌ష్యాలో కార్య‌కలాపాలు నిర్వ‌హ‌ణ‌పై ఆంక్ష‌లు విధిస్తోంది.

ఇదిలావుండగా, నాటో కూటమి దేశాలు రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ భ‌ద్ర‌త‌, ఆర్థిక సాయం గురించి అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చ‌ర్చించారు. ఫోన్ లో మాట్లాడుకున్న ఇరువురు నేత‌లు.. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం, రష్యాపై ఆంక్షల కొనసాగింపు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిపారు. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేయాలన్న ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్ మరియు టెక్నాలజీ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డ్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్వాగతించారు.