Asianet News TeluguAsianet News Telugu

రిషి సునక్ కుటుంబం గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలు

భారత సంతతికి చెందిన రిషి సునక్‌ చరిత్ర సృష్టించారు. తొలి శ్వేతజాతీయేతర వ్యక్తి గా బ్రిటన్‌ ప్రధాని పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ తరుణంలో ఆయన  కుటుంబం గురించి ఆరా తీస్తున్నారు. ఆయన ఈ స్థాయికి ఎదగడానికి కారణమేవ్వరూ.. ఆయనకు అండగా నిలిచివారెవరూ అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు నెటిజన్లు.   

Rishi Sunak's Mega-Wealthy Wife And In-Laws
Author
First Published Oct 25, 2022, 7:26 AM IST

భారత సంతతికి చెందిన రిషి సునక్‌ చరిత్ర సృష్టించారు. తొలి శ్వేతజాతీయేతర వ్యక్తి గా బ్రిటన్‌ ప్రధాని పీఠాన్ని ఎక్కబోతున్నాడు. పలు నాటకీయ పరిణామాల అనంతరం సోమవారం సాయంత్రం ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. అయితే రిషి సునక్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక.. ఆయన కుటుంబం గురించి ఆరా తీస్తున్నారు. ఆయన ఈ స్థాయికి ఎదగడానికి కారణమేవ్వరూ.. ఆయనకు అండగా నిలిచివారెవరూ అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు నెటిజన్లు.   

రిషి సునక్‌ ఇంతటీ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి క్రుషి చేసిన వ్యక్తి  అక్షతా మూర్తి . రిషి సునక్ భార్య. వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. అక్షత.. ఎవరో కాదు.. ప్రముఖ వ్యాపార వేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్. నారాయణ మూర్తి  కుమార్తె. అక్షతా మూర్తి  వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. ఆమె ప్రముఖ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేసింది. ఈ యూనివర్సిటీలోనే రిషి సునక్ ను అక్షతా మూర్తిని కలిశారు.వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయం వారి పెద్దలకు చెప్పారు. కానీ.. అక్షత తన తండ్రి నారాయణమూర్తి తొలుత  ఒప్పుకోలేదు. చాలా రోజులు వెయిట్ చేశారు. ఓ ఫైన్ డే.. రిషి సునక్‌ వెళ్లి  నారాయణమూర్తి తో  మాట్లాడారు. ఆ మీట్ తరువాత నారాయణమూర్తి ఆలోచన పూర్తి మారింది. వారి పెళ్లికి ఆయన ఒప్పుకున్నారు. వీరి పెళ్లి చాలా సింపుల్ గా 30 ఆగస్టు 2009న బెంగళూరులో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది. వారి పెళ్లికి కేవలం 500 మంది మాత్రమే హాజరయ్యారు. విప్రో ఛైర్మన్‌తో సహా పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు వారి పెళ్లికి వెళ్లారు.

బ్రిటన్ లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునక్ ఫ్యామిలీ ఒకటి. వారి సంపద 750 మిలియన్ పౌండ్ల ఉన్నట్టు అంచనా. ఇక అక్షతా ఆస్తి విషయానికి వస్తే.. సండే టైమ్స్‌తో సహా పలు వార్తాపత్రికల ప్రకారం..సునక్ భార్య ఆస్తుల విలువ కోట్లలో ఉంటుందట. ఇన్ఫోసిస్‌లో ఆమె  వాటా విలువ దాదాపు ఆరున్నర వేల కోట్లు. అలాగే.. అక్షతా మూర్తి ఇన్ఫోసిస్‌లో దాదాపు 1 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కలిగి ఉన్నాయని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. ఈ షేర్ అక్షతా మూర్తిని క్వీన్ ఎలిజబెత్ II ఆస్తి కంటే ఎక్కువే. దీనికి ముందు, బ్రిటన్‌లో పన్ను కుంభకోణంలో అక్షర్ పేరు చేర్చబడింది. విదేశీ ఆదాయం ఆధారంగా తగినంత పన్ను చెల్లించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ కేసు పరిష్కారమైంది.

ఇక సునక్ మామ గారు ఎన్ ఆర్ నారాయణ మూర్తి..1981లో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను సహ-స్థాపన చేసారు. ఇప్పుడు సుమారు $75 బిలియన్ల విలువైన అవుట్‌సోర్సింగ్ బెహెమోత్ భారతదేశాన్ని బాక్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్ గా సహాయపడింది. 

సునక్ అత్తగారు సుధ మూర్తి.. ఆమె టాటా మోటార్స్ తొలి మహిళా ఇంజనీర్. ఆమెను "భారతదేశ బామ్మ"గా పిలుస్తారు. ఆమె రచయిత్రి,  సామాజ సేవకురాలు. ఆమె దాదాపు 60,000 లైబ్రరీలను ఏర్పాటు చేసింది. అలాగే.. 16,000 మరుగుదొడ్లను నిర్మించింది. అపారమైన సంపద ఉన్నప్పటికీ ఆమె చాలా జీవితాన్ని గడుపుతోంది. ఆమె తన పిల్లలైన అక్షత, రోహన్‌లకు చాలా సింపుల్ గా పెంచింది. ఇంట్లో టెలివిజన్ లేకుండా కఠినంగా ఉండేలా చూసుకునేదట. అందరిలాగే.. తన పిల్లలను కూడా ఆటో రిక్షాలో పాఠశాలకు వెళ్లాలని పట్టుబట్టేవారట.  

Follow Us:
Download App:
  • android
  • ios