Asianet News TeluguAsianet News Telugu

అరుదైన గౌరవం.. చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన రిషి సునాక్

భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ నూతన అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. అక్టోబర్ 28న రిషి సునక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు, అక్టోబర్ 29న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయవచ్చు.

Rishi Sunak, First Indian-Origin UK Prime Minister
Author
First Published Oct 25, 2022, 12:37 AM IST

బ్రిటన్‌ రాజకీయాల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ చరిత్ర సృష్టించారు. ఆ దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధానిగా టోరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కానున్నారు. అంతకుముందు.. పెన్నీ మోర్డాంట్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రేసు నుండి వైదొలిగారు. దీంతో  సునక్ (42) ఎన్నిక సులభతరమైంది.  అదే సమయంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 357 మంది ఎంపీల్లో సగానికి పైగా ఆయనకు మద్దతు పలికారు. పార్టీ నాయకుడు కావడానికి  కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం.

ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషి సునక్ బ్రిటన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటరీ సహచరుల మద్దతు, కన్జర్వేటివ్ మరియు యూనియనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎన్నికైనందుకు తాను వినయపూర్వకంగా, గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఇది తన  జీవితంలో గొప్ప అదృష్టం. దానికి తాను చాలా కృతజ్ఞుడిగా ఉంటానని పేర్కొన్నారు. యుకె గొప్ప దేశమని, అయితే మనం తీవ్ర ఆర్థిక సవాలును ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు. ఇప్పుడు  స్థిరత,  ఐక్యత అవసరమని అన్నారు.

 పార్టీని ,దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి తాను ప్రధాన ప్రాధాన్యతనిస్తాననీ,  ఎందుకంటే సవాళ్లను అధిగమించడానికి, మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగల ఏకైక మార్గం ఇదేననీ, తాను  నిజాయితీగా మరియు వినయంతో సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తునని తెలిపారు. ఇదిలాఉంటే.. అక్టోబర్ 28న రిషి సునక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు, అక్టోబర్ 29న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయవచ్చు.

బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునక్ యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క మొదటి హిందూ , నల్లజాతి ప్రధాన మంత్రి కానున్నారు. బ్రిటీష్ ప్రధాని పదవి రేసులో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు ఉపసంహరించుకోవడంతో సోమవారం కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వాన్ని రిషి సునక్ చేపట్టే అవకాశాలు బలపడ్డాయి. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత, సునక్ కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఇతర సభ్యులు ఘనస్వాగతం పలికారు.

లిజ్ ట్రస్ అభినందనలు

కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, UK తదుపరి ప్రధానమంత్రిగా నియమితులైన రిషి సునక్‌ను మాజీ ప్రధాని లిజ్ ట్రస్ అభినందించారు. "కన్సర్వేటివ్ పార్టీ నాయకుడిగా,  తదుపరి ప్రధానిగా ఎన్నికైన  రిషి సునక్‌కు అభినందనలు.  పూర్తి మద్దతు ఉంది" అని ట్వీట్ చేశాడు.

ప్రధాని మోడీ అభినందనలు

రిషి సునక్‌ను అభినందిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. "ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేయడానికి , రోడ్‌మ్యాప్ 2030ని అమలు చేయడానికి  ఎదురుచూస్తున్నాను. మా చారిత్రాత్మక బంధాన్ని ఆధునిక భాగస్వామ్యంగా మారుస్తున్నందున అభినందనలు. యూకే భారతీయుల 'జీవన వారధి'కి ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు." అని పేర్కొన్నారు. 

పలువురు మాజీ మంత్రుల మద్దతు 

తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మాజీ ఛాన్సలర్, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని, తన పార్టీని ఏకం చేసి దేశం కోసం పని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతకుముందు సోమవారం మాజీ హోం మంత్రి ప్రీతి పటేల్, క్యాబినెట్ మంత్రులు జేమ్స్ క్లీవర్, నదీమ్ జాహవితో సహా పలువురు ప్రముఖ కన్జర్వేటివ్ ఎంపీలు సునక్‌కు మద్దతుగా జాన్సన్ శిబిరాన్ని విడిచిపెట్టారు.

లిజ్ ట్రస్ రాజీనామా  

లిజ్ ట్రస్ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత గత నెలలో తన పదవికి రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ సునక్‌కు నాయకత్వం వహించే అవకాశం ఇవ్వాలని ఆమె అన్నారు. పార్టీలో తన నాయకత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసిన 45 రోజుల తర్వాత లిజ్ ట్రస్ గురువారం (అక్టోబర్ 20) ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో నాయకత్వ పోటీ సందర్భంగా లిజ్ ట్రస్ పన్ను తగ్గింపు ఎజెండాను రిషి సునక్ విమర్శించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చిన తర్వాతే పన్నులు తగ్గిస్తామన్నారు. 2029 నాటికి ఆదాయపు పన్నును 20% నుంచి 16%కి తగ్గించే ప్రణాళికను కూడా ఆయన వివరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios