Asianet News TeluguAsianet News Telugu

అదృష్టం వెతుక్కొంటూ వచ్చింది: చించేసిన టిక్కెట్టుకే రూ.461 కోట్లు

ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకొని  తిరిగి పొందితే ఎంతో ఆనంద పడతాం.స్కాట్లాండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది. వందల కోట్ల విలువైన లాటరీ టిక్కెట్టును  సిబ్బంది నిర్లక్ష్యంగా చింపేశారు

Retired couple scoop life-changing lottery ticket

స్కాట్లాండ్: ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకొని  తిరిగి పొందితే ఎంతో ఆనంద పడతాం.స్కాట్లాండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది. వందల కోట్ల విలువైన లాటరీ టిక్కెట్టును  సిబ్బంది నిర్లక్ష్యంగా చింపేశారు. సీసీ పుటేజీలో చింపిన టిక్కెట్టు నెంబర్‌కే లాటరీ వచ్చిందని గుర్తించారు. దీంతో  ఆ వ్యక్తికి లాటరీ డబ్బులను అందించారు. 

స్కాట్లాండ్‌కు చెందిన  అబెర్‌డీన్ షైర్ కు చెందిన  వృద్ద దంపతులు  ఫ్రెడ్, లెస్లీ హిగిన్స్  ల లైఫ్ చేంజింగ్ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు.  అయితే తాము కొనుగోలు చేసిన టిక్కెట్టుకు లాటరీ దక్కిందో లేదో అనే  లాటరీ కార్యాలయంలో వాకబు చేసేవారు.  అయితే ఎప్పుడూ కూడ వీరు కొనుగోలు చేసిన  టిక్కెట్టుకు లాటరీ దక్కలేదు. ఇదే క్రమంలో  ఈ ఏడాది జూలై 10వ తేదీన  జరిగిన ఈ దంపతులు కొనుగోలు చేసిన టిక్కెట్టుకు లాటరీ దక్కింది.

లాటరీ టిక్కెట్టును తీసుకొని ఆ వృద్ద దంపతులు లాటరీ కార్యాలయానికి వెళ్లారు. అయితే  అక్కడ ఉన్న సిబ్బంది లాటరీ టిక్కెట్టుపై ఉన్న నెంబర్ ను సరిగా చూడకుండానే  టిక్కెట్టును చింపేశారు.  దీంతో  హిగిన్స్  సహాయ కేంద్రంలో సంప్రదించాడు.  విచారణ కోరారు .  సీసీ టీవీ పుటేజీ ఆధారంగా చెత్తబుట్టలో వేసిన  లాటరీ టిక్కెట్టును పరిశీలించారు.

హిగిన్స్ కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్టుకు రూ.461 కోట్ల జాక్‌పాట్ దక్కింది.  సీసీటీవీ పుటేజీలో  టిక్కెట్ నెంబర్ కన్పించడంతో ఆ టిక్కెట్టును చెత్త బుట్ట నుండి బయటకు తీశారు.  హిగిన్స్ దంపతులకు రూ.461 కోట్లను లాటరీ నిర్వాహకులు అందించారు. 

ఈ లాటరీ డబ్బులతో  ఆడి కారు, కరీబియన్ దీవుల్లోని బార్బడోస్‌లో విలాసవంతమైన  ఇల్లును కొనుగోలు చేసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తామని ఆ వృద్ద దంపతులు ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios