కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. కాగా.. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రెమ్ డెసివర్ మెడిసిన్ అందజేశారు. కాగా.. ఈ యాంటీ వైరల్ మెడిసిన్ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదని తాజాగా డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

ఆస్పత్రిలో బాధితులు కోలుకునే సమయాన్ని తగ్గించడంలో, మరణం నుంచి బయటపడేయడానికి ఈ మందు పెద్దగా ప్రభావం చూపించడం లేని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కరోనా చికిత్సలో ప్రయోగాత్మక ఔషధాలైన రెమ డెసివర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినవిర్ ఇంటర్ ఫెరాన్ చూపుతున్న ప్రభవాన్ని అధ్యయనం చేసేందుకు ఆరోగ్య సంస్థ 30 దేశాలకు చెందిన 11,266 మంది వయోజనులపై క్లినికల్ ప్రయోగాలు నిర్వహించింది.

మరణం నుంచి తప్పించడం, ఆస్పత్రిలో ఉండే సముదాయాన్ని తగ్గించడంలో ఈ ఔషదాలు ఎలాంటి ప్రభావం చూపించడం లేదని ఆ ప్రయోగాల ద్వారా గుర్తించినట్లు సంస్థ తెలిపింది. అయితే.. ప్రయోగ ఫలితాలను ఇంకా సమీక్షించాల్సి ఉందని చెప్పారు. కాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాలు స్థిరంగా లేవని గిలిద్ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన సమాచారం నిర్మాణాత్మకమైన శాస్త్రీయ చర్చకు అనుకూలంగా లేదని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా.. 1,062 మందిపై చేపట్టిన అధ్యయనంలో రెమ్ డెసివర్ కరోనా బాధితుల చికిత్స సమయాన్ని ఐదు రోజులు తగ్గించిందని వెల్లడైనట్లు ఇటీవల గిలిద్ ప్రకటించింది. కరోనా బాధితుల చికిత్సలో వాడేందుకు మొదట అనుమతి పొందిన మెడిసిన్ ఇదే కావడం గమనార్హం.