శ్రీలంక దేశ చరిత్రలో మొట్ట మొదటి సారిగా ఓటింగ్ పద్దతిలో అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
శ్రీలంకలో ప్రముఖ రాజకీయ నాయకుడు రణిల్ విక్రమసింఘే గురువారం ఆ దేశ ఎనిమిదో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 73 ఏళ్ల విక్రమసింఘే శ్రీలంక 8వ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఎదుట పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం సాగింది. ఆయన కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోయి, గత వారం రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించారు. అయితే దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓటింగ్ తర్వాత పార్లమెంటు ద్వారా ఎన్నుకున్న శ్రీలంక మొదటి అధ్యక్షుడిగా రికార్డుకెక్కారు.
మే 1993లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ఆర్ ప్రేమదాసు మరణించారు. దీంతో ఆయన స్థానంలో దివంగత డీ బీ విజేతుంగ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. అయితే ఆరుసార్లు మాజీ ప్రధానిగా పనిచేసిన విక్రమసింఘే బుధవారం శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 225 మంది సభ్యులున్న సభలో ఆయనకు 134 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, అసమ్మతి అధికార పార్టీ నాయకుడు దుల్లాస్ అలహపెరుమాకు 82 ఓట్లు వచ్చాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్లమెంటులో జరిగిన ఓటింగ్ లో వామపక్ష జనతా విముక్తి పెరమునా నాయకుడు అనురా కుమార దిస్సానాయకే కేవలం మూడు ఓట్లు మాత్రమే సాధించారు.
దేశాన్ని దాని ఆర్థిక పతనం నుంచి బయటకు నడిపించడం, నెలల తరబడి నెలకొన్న సామూహిక నిరసనలను చల్లార్చి అన్ని వ్యవస్థలను పునరుద్ధరించాల్సిన పనిని ఆయన ఎదుర్కోనున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో 20-25 మంది సభ్యులతో కూడిన కేబినెట్ ను అధ్యక్షుడు విక్రమసింఘే ఆధ్వర్యంలో నియమించనున్నట్లు ‘డైలీ మిర్రర్’ వార్తాపత్రిక తెలిపింది.
అమెరికాలో షాకింగ్ ఘటన.. వృద్ధురాలి వేషంలో వచ్చి.. బ్యాంకు దోపిడి..
కాగా రాజపక్సకు చెందిన శ్రీలంక పొడుజన పెరామునా (ఎస్ ఎల్ పీపీ) పార్టీ మద్దతుతోనే విక్రమసింఘే సునాయాసంగా విజయం సాధించారు. ఇటీవలి వారాలలో భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధానిగా ఉన్న మహింద రాజపక్స అలాగే ఆర్థిక మంత్రి ఉన్న బాసిల్ రాజపక్స రాజీనామాలు చేశారు. అయినప్పటికీ రాజపక్స కుటుంబం శ్రీలంక రాజకీయాలపై గట్టి పట్టును చూపించింది.
విక్రమసింఘే విజయం కూడా మరోసారి ఆందోళనల పరిస్థితిని రేకెత్తించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు మునుపటి రాజపక్స పాలనతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందనే భావిస్తున్నారు. విక్రమసింఘేను అధ్యక్షుడిగా ఎన్నుకున్న తరువాత కొన్ని వందల మంది నిరసనకారులు కొంత సమయంలో ఒక్క దగ్గర గుమిగూడారు. వారు ఆయనను సమస్యాత్మక రాజకీయ స్థాపనలో భాగంగా చూడటంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా 2024 నవంబరు వరకు విక్రమసింఘే అధ్యక్షుడిగా పని చేయనున్నారు.
ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసన.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత
1948 లో స్వాతంత్రం పొందిన శ్రీలంక.. ఎప్పుడూ చూడని ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం ఎదుర్కొంటోంది. ఆ దేశం దగ్గర విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ముఖ్యంగా ఇంధనం, మెడిసిన్, ముఖ్య ఆహార వస్తువులను కొనుగోలు చేయలేకపోతోంది. పెట్రోల్ పంపులలో కిలో మీటర్ల కొద్దీ లైన్లలో నిలబడిన దృష్యాలు ఇటీవల తరచూ కనిపించాయి. దీంతో ప్రజల్లో ఆగ్రహం ఒక్క సారిగా కట్టలు తెంచుకుంది. నిరసనలు చేపట్టి అధ్యక్షుడిని తరిమేసేలా చేశారు.
