దొంగతనం చేయడానికి ఓ వ్యక్తి వింత ఎత్తుగడ వేశాడు. వృద్ధ మహిళలా తయారై బ్యాంకుదోపిడీకి పాల్పడ్డాడు. ఆ తరువాత దర్జాగా నెంబర్ లేని కారులో పరారయ్యాడు. 

అమెరికా : అమెరికాలోని జార్జియాలో ఒక వ్యక్తి వృద్ధురాలి వేషంలో బ్యాంకు వద్దకు వచ్చాడు. ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది వద్దకు వెళ్లి తుపాకీ చూపించి బెదిరించాడు. బ్యాంకులోని నగదు దోచుకున్నాడు. ఆ తరువాత మెల్లిగా బయటకు వచ్చి నెంబర్ ప్లేట్ లేని తెల్లటి ఎస్వీయూ కార్లో దర్జాగా వెళ్లిపోయాడు. నిజానికి బ్యాంకు పరిసర ప్రాంతాల్లో వాళ్లు కూడా ఆ వింత గెటప్ ను పసిగట్టలేకపోయారు. ఈ ఘటన అట్లాంటాలోని హెన్నీ కౌంటీలో చోటుచేసుకుంది. 

దోపిడీ చేసేటప్పుడు ఆ వ్యక్తి పూల పూల దుస్తులతో ఆకర్షనీయంగా వచ్చాడు. ఈ మేరకు పోలీసులు సోషల్ మీడియాలో అతని ఫొటోలు షేర్ చేశారు. జరిగిన ఘటన గురించి వివరాలు వెల్లడించారు. ఆ నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిబ్బంది ఫిర్యాదు చేసే వరకు ఈ విషయం వెలుగు చూడక పోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఈ కాలంలో దొంగలు దొంగతనం చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. 

‘గే’ వివాహాలకు చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు అమెరికా ఆమోదం...

అమెరికాలోని జార్జియాలో వృద్ధురాలి వేషధారణలో బ్యాంకును దోచుకున్న అనుమానితుడిని ఆరడుగుల పొడవైన బక్కపలుచని మనిషిగా వర్ణించారు. అతను దోపిడి సమయంలో పూల దుస్తులు, తెల్లటి స్నీకర్లు, నారింజ రబ్బరు తొడుగులు, తెల్లటి విగ్, ముఖానికి ముదురు ముసుగు లేదా మెడ "గేటర్" ధరించి ఉన్నాడు. ఫేస్‌బుక్ పోస్ట్ లో తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి మెక్‌డొనఫ్ నగరంలోని చేజ్ బ్యాంక్‌ను కొల్లగొట్టాడు. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిబ్బందికి నోట్‌ ఇచ్చాడు, తన వద్ద తుపాకీ ఉందని బ్యాంకు సిబ్బందిని బెదిరించాడని ఆరోపించారు. 

ఛేజ్ బ్యాంక్‌ను దోచుకున్న వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నట్లు మెక్‌డొనఫ్ పోలీసులు తెలిపారు. వృద్ధురాలి వేషంలో ఉన్న వ్యక్తి చిత్రాలను వారు షేర్ చేశారు. ఈ వింత ఘటనపై ఇంటర్నెట్లో చాలా వేగంగా స్పందించారు. అతన్ని త్వరలో పోలీసులు పట్టుకుంటారని ఆశించారు. అంత వింత వేషంలో వచ్చినా.. బ్యాంకులో ఎవరూ గుర్తించకపోవడం విచిత్రం అని కొంతమంది అన్నారు. 

ఇదే విధమైన సంఘటన, ప్యారిస్‌లోని లౌర్వ్ మ్యూజియంలో మే నెలలో చోటు చేసుకుంది. మ్యూజియంలో ప్రేక్షకులు తిలకిస్తున్న సమయంలో "వృద్ధ మహిళ" మారువేషంలో ఉన్న వ్యక్తి మోనాలిసా పెయింటింగ్‌పై కేక్‌ను అద్ది, వీల్‌చైర్ నుండి దూకి పారిపోయాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అతను లౌవ్రే మ్యూజియంలోని లియోనార్డో డా విన్సీ చిత్రాన్ని రక్షించే బుల్లెట్ ప్రూఫ్ గాజును పగలగొట్టడానికి కూడా ప్రయత్నించాడు.