Asianet News TeluguAsianet News Telugu

కెమిల్లా వ‌ద్ద‌కే చేర‌నున్న ప్ర‌సిద్ధ కోహినూర్ కిరీటం.. ఎందుకంటే ?

బ్రిటన్‌ చక్రవర్తి క్వీన్ ఎలిజబెత్ - II మరణించిన తరువాత ఆమె వద్ద ఉన్న కోహినూర్ డైమండ్ పొదిగిన కిరీటం కెమిల్లాకు దక్కునుంది. ఆమె భర్త ప్రిన్స్ చార్లెస్ తదుపరి రాజుగా మారనున్నారు. 

Queen Elizabeth's death.. Kohinoor crown to go to Camilla
Author
First Published Sep 9, 2022, 10:01 AM IST

బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి క్వీన్ ఎలిజబెత్ - II (96) గురువారం మరణించారు. అయితే ఆమె ఆరోగ్యంపై నెల‌కొన్న ఆందోళనల కారణంగా ఆమెను ముందుగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. రాజకుటుంబ సభ్యులు - క్వీన్స్ కుమారులు, మనవలు బాల్మోరల్ కాజిల్‌కు చేరుకున్న తర్వాత బకింగ్‌హామ్ ప్యాలెస్ మ‌ర‌ణంపై అధికారిక ప్రకటన చేసింది. ఆమె 70 ఏళ్ల పాలన ముగిసిన నేప‌థ్యంలో త‌దుప‌రి సింహాస‌నం అధిష్టించ‌డానికి ప్రిన్స్ చార్లెస్ ముందు వ‌ర‌సలో ఉన్నారు. దీంతో కోహినూర్ వజ్రానికి సంబంధించిన మ‌రో కీల‌క మార్పు చోటు చేసుకునుంది.

క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత ఆపరేషన్ యూనికార్న్ అమలు.. ఏమిటీ ఈ ఆపరేషన్?

ఈ ఏడాది ప్రారంభంలో ప్రిన్స్ చార్లెస్ సింహ‌స‌నాన్ని అధిష్టించిన‌ప్పుడు ఆయ‌న భార్య క్వీన్ కన్సార్ట్ అవుతారని రాణి ప్రకటించింది. దీంతో అత‌డి భార్య కెమిల్లా క్వీన్ ప్రసిద్ధ కోహినూర్ కిరీటాన్ని అందుకుంటుంది.

కోహినూర్ చరిత్రలో నిలిచిపోయిన 105.6 క్యారెట్ల వజ్రం. ఈ వజ్రం 14 వ శతాబ్దంలో భారతదేశంలో ల‌భించింది. శ‌తాబ్దాల కాలంలో ఈ డైమండ్ అనేక చేతులు మారింది. 1849 లో పంజాబ్ ను బ్రిటిష్ స్వాధీనం చేసుకున్న తరువాత ఈ వజ్రం విక్టోరియా రాణికి మొద‌టగా అందించారు. అప్పటి నుండి ఇది బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్‌లో భాగంగా ఉంది.కానీ భారతదేశంతో పాటు మ‌రో నాలుగు దేశాల మ‌ధ్య ఇది వివాదాస్ప‌ద అంశంగా కొన‌సాగుతోంది.

మాన‌వాభివృద్ధి సూచీలో దిగ‌జారిన భార‌త్ ర్యాంక్

1937లో కింగ్ జార్జ్ VI పట్టాభిషేకం స‌మ‌యంలో క్వీన్ ఎలిజబెత్ కోసం రూపొందించిన ప్లాటినం కిరీటంలో ఈ కోహినూర్ డైమండ్ ను అమ‌ర్చారు. ప్ర‌స్తుతం ఇది లండన్ టవర్‌లో ప్రదర్శనలో ఉంచారు. కాగా.. ప్రిన్స్ చార్లెస్ కింగ్ అయిన తరువాత కెమిల్లా తలపై వెలకట్టలేని ప్లాటినం, డైమండ్ కిరీటాన్ని ఉంచుతారని యూకేకు చెందిన డైలీ మెయిల్ ప్రత్యేక నివేదికలో పేర్కొంది.

చికెన్ వింగ్స్ ఆర్డర్ చేస్తే.. ఎముకలు, లెటర్.. దాంట్లో ఉన్న విషయం చూసి కంగుతిన్న కస్టమర్..

ఎలిజబెత్ II తన తండ్రి కింగ్ జార్జ్ VI మరణం తరువాత 1952 ఫిబ్రవరి 6వ తేదీన 25 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్టించారు. ఆమె 1947 నవంబర్ 20వ తేదీన ప్రిన్స్ ఫిలిప్‌ను వివాహం చేసుకుంది. ఆయ‌న గ‌తేడాది మ‌ర‌ణించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios