పుల్వామా ఉగ్రదాడి భారత్-పాక్ దౌత్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పాక్ నుంచి భారత హైకమిషనర్‌ను వెనక్కిపిలవాలని...అలాగే ఢిల్లీలోని భారత హైకమిషనర్‌ను వెనక్కి పిలవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో పాకిస్తాన్ ముందుగా అప్రమత్తమైంది. భారత్‌లోని తమ దేశ హైకమిషనర్‌ను పాక్ వెనక్కి పిలిపించింది. పాక్ విదేశాంగ శాఖ ఇవాళ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. పాక్ హైకమిషనర్ సోమవారం ఉదయం ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు.

అయితే ఆయన్ను మళ్లీ వెనక్కి పిలిపించినట్లు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ ఫైసల్ ట్వీట్ చేశారు. పుల్వామా దాడి తర్వాత ప్రస్తుత పరిస్ధితిని హైకమిషనర్‌తో చర్చించే అవకాశం ఉంది.