ప్రధాని అభ్యర్థి ఓటే చెల్లకుండా పోనుందా?

PTI chief Imran Khan casts ballot in NA-53 islamabad
Highlights

పాకిస్థాన్ లో అధికారం కోసం ఇవాళ ప్రధాన పార్టీలన్నీ హోరా హోరీగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. దేశంలో 11వ సార్వత్రిక ఎన్నికలు పోలీంగ్ ఇవాళ ఉదయం 8 గంటకు ప్రారంభమైంది.  అయితే ఈ ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీ ప్రధాని స్థాయి అభ్యర్థి ఓటే చెల్లకుండా పోయేలా కనిపిస్తుంది. పాకిస్థాన్ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఆయన ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో ఆయన వేసిన ఓటు రద్దయ్యే అవకాశాలున్నాయని రాజకీయంగా చర్చ జరుగుతోంది.

పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆయితే ఆయన ఇవాళ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ బూత్ లో నిబంధనలను ఉల్లగించి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అంటే మీడియా సమక్షంలోనే తాను ఏ పార్టీకి  ఓటేస్తున్నాడో తెలిసేలా బ్యాలెట్ పేపర్ పై స్టాంప్ వేశాడు. ఈ దృశ్యాలన్నీ మీడియాలో యదావిదిగా ప్రసారమయ్యాయి.

అయితే పాకిస్థాన్ ఎన్నికల నియమనిబందనల ప్రకారం రహస్య బ్యలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. అంటే కేవలం ఓటేసే వ్యక్తికి తప్ప ఎవరికీ అతడు ఏ పార్టీకి ఓటేశాడో తెలియకూడదు. అక్కడే ఉండే ప్రిసైడింగ్ అధికారికి కూడా. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం బహిరంగంగా ఓటేయడంతో అతడి ఓటు విషయంలో బాగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

loader