బ్రిటన్ రాజకుటుంబ 'సీనియర్ సభ్యుల' బాధ్యతల నుంచి వైదొలగుతామని, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు పనిచేస్తామని రాజకుమారుడు 'డ్యూక్ ఆఫ్ ససెక్స్' హ్యారీ, ఆయన భార్య 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మార్కెల్ కొంతకాలం క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాగా.. అలా ప్రకటించిన తర్వాత తొలసారి హ్యారీ-మేఘన్ జంట కొన్ని ఫోటోలు విడుదల చేశారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Duke and Duchess of Sussex 📸 by me

A post shared by Matt Sayles (@msayles) on Oct 19, 2020 at 7:02pm PDT

బ్లాక్ అండ్ వైట్  లో వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోల్లో వారిద్దరూ నవ్వులు చిందిస్తూ కనిపించారు. హ్యారీ మోకాళ్ల మీద చేతులు వేసి నవ్వుతూ ఆమె ఫోటోకి ఫోజు ఇచ్చారు. కాగా.. ఇద్దరూ ఆ ఫోటోల్లో బ్లేజర్, ట్రోజర్స్ ధరించి ఉన్నారు. ఆ ఫోటోలను లాస్ ఏంజెల్స్ కి చెందిన ఫోటోగ్రాఫర్ మాట్ సెయిల్స్ తీసినట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియాలోని వారి ఇంట్లోనే ఫోటోలు దిగినట్లు పీపుల్స్ మ్యాగజైన్ ప్రకటించింది.

2018మేలో ఈ జంట.. తమ పెళ్లి సమయంలో ఇదేవిధంగా బ్లాక్ అండ్ వైట్ లో ఫోటో దిగి షేర్ చేయగా.. తర్వాత మళ్లీ ఇప్పుడు తాజాగా ఫోటోలు షేర్ చేశారు.  ఈ ఫోటోలు కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.