Narendra Modi Dubai visit... క్లైమెట్ యాక్షన్ సమ్మిట్, ధ్వైపాక్షిక చర్చలు: దుబాయ్‌లో మోడీ బిజీ బిజీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  దుబాయ్ లో 21 గంటల పాటు బిజీ బిజీగా గడపనున్నారు. క్లైమెంట్ యాక్షన్ సమ్మిట్ తో పాటు  ఇతర కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. ధ్వైపాక్షిక అంశాలపై  మోడీ చర్చలు జరపనున్నారు. 
 

Prime minister modi participates climate events and bilateral meetings in dubai lns


న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  దుబాయ్ లో సుమారు  21 గంటల పాటు  పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో మోడీ  పాల్గొంటారు.
క్లైమెట్ యాక్షన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దుబాయ్ వెళ్లారు. దుబాయ్  చేరుకున్న మోడీకి  భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు.

దుబాయ్ లో జరిగే పలు సమావేశాల్లో నాలుగు చోట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. వాతావరణ యాక్షన్ ప్లాన్ కు సంబంధించి చేపట్టే రెండు ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. అంతేకాదు ఏడు ద్వైపాక్షిక సమావేశాల్లో కూడ  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు.

భారతదేశం, యూఏఈ  బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.ఇంధన రంగంలో ఒకరి బలాన్ని మరొకరు సద్వినియోగం చేసుకుంటామని ఆయన  చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమికి మద్దతివ్వడానికి కృషి చేస్తామని  ప్రధాని మోడీ చెప్పారు. ప్రధానమంత్రి మోడీ యూఏఈలో ఆరో దఫా పర్యటిస్తున్నారు.  

పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ప్రపంచ పునరుత్పాదక  ఇంధన ప్రయత్నాల్లో భార్, యూఏఈలు అగ్రస్థానంలో ఉన్నాయని మోడీ పేర్కొన్నారు. క్లైమెట్ యాక్షన్ ప్లాన్ విషయంలో యూఏఈ చేపట్టిన విధానాలను నరేంద్ర మోడీ ప్రశంసించారు. దుబాయ్ కు మోడీ చేరుకోగానే ఆయనకు ఘనంగా స్వాగతం లభించింది.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios