Asianet News TeluguAsianet News Telugu

టర్కీ భూకంపంలో 24కు చేరిన మృతుల సంఖ్య.. ఇంకా పెరిగే ఛాన్స్...

టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంప మృతుల సంఖ్య 24కు చేరింది. గాయాల పాలైన వారి సంఖ్య 800 దాటింది. వీరిలో దాదాపు 450మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

Powerful earthquake jolts Turkey and Greece, killing at least 24 - bsb
Author
Hyderabad, First Published Oct 31, 2020, 9:26 AM IST

టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంప మృతుల సంఖ్య 24కు చేరింది. గాయాల పాలైన వారి సంఖ్య 800 దాటింది. వీరిలో దాదాపు 450మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

స్వల్ప గాయాలైన దాదాపు 364 మంది ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ఇజ్మిర్ ప్లావిన్స్ లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు. 

మరోవైపు భూకంపం వల్ల వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. వారందరి కోసం ప్రభుత్వం పునరావాస ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఇజ్మిర్ ఫ్రావిన్స్, గ్రీకు ద్వీపమైన సామోన్ ల మధ్య శుక్రవారం సాయంత్రం భూమి కంపించిన విషయం తెలిసిందే. సామోన్ లోనూ నలుగురు స్వల్పంగా గాయడగా, కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు. సామోన్ కు 13 కి.మీ దూరంలో ఏజీన్ వద్ద భూకంపం కేంద్రీకృతమయింది. 16.5 కి.మీ. లోతున భూమి పొరల్లో ఇది సంభవించింది. దీని తీవ్ర 6.6గా నమోదయ్యింది.

సెఫిరిసార్ ప్రాంతంలో స్వల్పంగా సునామీ కూడా వచ్చింది. బాగా లోతులో భూకంపం వచ్చినందున భూమిలో సర్దుబాట్లు జరుగుతాయని, అందువల్ల కొద్ది వారాల పాటు ప్రకంపనల ప్రభావం ఉంటుందని నిపుణులు తెలిపారు. భూకంపం కారణంగా దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios