Asianet News TeluguAsianet News Telugu

శుక్రగ్రహం మీద జీవం: బ్రిటన్ శాస్త్రవేత్తల కీలక పరిశోధన

అనంత విశ్వం.. ఓ అంతుచిక్కని రహస్యం. ఈ చిక్కుముడులను విప్పేందుకు ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే వున్నారు. విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా..? సూదూరాన ఇంకా ఎక్కడైనా జీవులు ఉన్నాయా..? అవకాశం వుందా అనే విషయం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎడతెరిపి లేని ప్రయోగాలు చేస్తుంటారు

Potential sign of alien life detected on inhospitable Venus
Author
London, First Published Sep 15, 2020, 2:29 PM IST

అనంత విశ్వం.. ఓ అంతుచిక్కని రహస్యం. ఈ చిక్కుముడులను విప్పేందుకు ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే వున్నారు. విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా..? సూదూరాన ఇంకా ఎక్కడైనా జీవులు ఉన్నాయా..? అవకాశం వుందా అనే విషయం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎడతెరిపి లేని ప్రయోగాలు చేస్తుంటారు.

అరుణ గ్రహం, చంద్రుడి మీద జీవం మనుగడకు గల అవకాశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వెల్లడైన కొన్ని కథనాలు శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుపుతున్నాయి.

శుక్రుడిపై ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్పైన్ అణువులు ఉన్నట్లు బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం వెల్లడించారు. సాధారణంగా ఆక్సిజన్ లేని ప్రాంతంలో నివసించే సూక్ష్మజీవులు ఫాస్పైన్‌ను విడుదల చేస్తాయి.

శుక్రుడిపై ఫాస్పైన్ ఉందంటే అక్కడ సూక్ష్మజీవులు కూడా ఉన్నట్లేగా అని పరిశోధకులు భావిస్తున్నారు. శాస్త్రవేత్తల బృందం చిలీలోని అటకామా ఎడారిలోని టెలిస్కోప్‌లను ఉపయోగించి శుక్రగ్రహం ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని క్లౌడ్ డెక్‌ను పరిశీలించారు.

ఈ పరిశోధనలోనే వీరు ఫాస్పైన్ ఉనికిని గుర్తించారు. భూమి మీద ఇది సేంద్రియ పదార్ధాల విచ్ఛిన్నం నుంచి లభిస్తుంది.. ఫాస్పైన్‌కు మండే స్వభావం వుంటుంది. అయితే మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఫాస్పైన్‌ ఉన్నంత మాత్రాన జీవం వుండగలదని చెప్పలేమంటున్నారు.

ఈ సందర్భంగా కార్డిఫ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీకి చెందిన లీడ్ రచయిత జేన్ గ్రీవ్స్ ఏఎఫ్‌పీతో మాట్లాడారు. ‘‘ ఫాస్పైన్ ఉన్నంత మాత్రాన ఆ గ్రహం మీద జీవం వుందని చెప్పలేమన్నారు.

ఒక గ్రహం మీద భాస్వరం సమృద్ధిగా ఉన్నప్పటికీ.. జీవం మనుగడకు సంబంధించిన ముఖ్యమైనది అక్కడ లేకపోవచ్చు. ఇతర మూలకాలు ఉండటం వల్ల అక్కడ పరిస్ధితులు చాలా వేడిగా.. పొడిగా ఉండవచ్చని గ్రీవ్స్ అభిప్రాయపడ్డారు. అయితే భూమి కాకుండా వేరే రాతి గ్రహం మీద ఫాస్పైన్ కనుగొనడం ఇదే మొదటిసారి కాదన్నారు.

శుక్రగ్రహం మీదే ఇంత ఆసక్తి ఎందుకంటే.. ఇది మనకు సమీపంగా ఉండటమే కాక పరిమాణంలో భూమికి సమానంగా ఉంటుంది. అంతేకాక గత అధ్యయనాలు ఇక్కడ చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయని లావా ప్రవాహాల సంకేతాలతో సహా గుర్తించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios