Asianet News TeluguAsianet News Telugu

మహిళా పోలీసుని కిడ్నాప్ చేసి.. లైంగికంగా వేధించి..!

పంజాబ్ లోని ముజఫర్ గర్ జిల్లా లో ఓ మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ ని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా టార్చర్ చేశాడు. లైంగికంగా వేధించాడని పోలీసులు తెలిపారు. 

Policewoman abducted, tortured, sexually assaulted by man in Pakistan's Punjab
Author
Hyderabad, First Published Sep 6, 2021, 11:17 AM IST

ఓ మహిళా పోలీసు పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. ఆమె ఓ పోలీసు అనే భయం కూడా లేకుండా.. ఏకంగా మహిళా పోలీసుని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెకు నరకం చూపించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ లోని ముజఫర్ గర్ జిల్లా లో ఓ మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ ని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా టార్చర్ చేశాడు. లైంగికంగా వేధించాడని పోలీసులు తెలిపారు. 

మహిళా పోలీసును కారులో కూర్చోపెట్టి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత.. ఆమెను తుపాకీతో బెదిరించి.. ఇన్ స్పెక్టర్ పై పలుమార్లు అత్యాచారానికి  యత్నించాడు.

కాగా.. ఆమె శుక్రవారం కిడ్నాప్ చేయగా.. ఆదివారం ఓ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. తీవ్రగాయాల తో పడి ఉన్న మహిళా పోలీసు అధికారిని  అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెపై దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేశారు. ఉన్నతాధికారులు ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios