న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్  పట్టణంలో కేథడ్రల్ చర్చిలో ఓ దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో దుండగుడు మరణించాడు.

ఆదివారం నాడు చర్చిలోకి ప్రవేశించిన దుండగుడు రెండు ఆటోమెటిక్ హ్యాండ్ గన్స్ తో  కాల్పులు జరిపాడు.

ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు చర్చిలో దుండగుడు కాల్పులకు దిగాడు.

దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్న ఒక డిటెక్టివ్, ఒక సార్జెంట్ పోలీస్ అధికారి 15 రౌండ్లు కాల్పులు జరిపి ఆ వ్యక్తిని చంపారు. దుండగుడు తెల్లటి బేస్ బాల్ టోపీ పెట్టుకొన్నాడు. ముఖానికి  మాస్క్ పెట్టుకోవడం ద్వారా అతడిని గుర్తించడం కష్టమైందని స్థానికులు చెప్పారు.

చర్చిలోని వారిపై కాల్పులు జరుపుతూ తనను కాల్చాలని దుండగుడు పెద్దగా అరిచినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు.

చెత్త డబ్బాల వెనుకన ఉన్న పోలీస్ అధికారి దుండగుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చర్చిలోని కొందరు మెట్ల దిగువన దాక్కొన్నారు. మరికొందరు ప్రాణభయంతో దీపపు స్థంభం వెనుకాల ఉన్నారు.