న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ప్రధానిగా జసింద్రా అండ్రెన్ తిరిగి  ఎన్నిక కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆమెను అభినందించారు.

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంచేదిశగా కృషి చేయాలని ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు.న్యూజిలాండ్ ప్రధానిగా తిరిగి ఎన్నికైనందుకు ఆమెను నా హృదయపూర్వక అభినందనలు అని ఆయన ట్విట్టర్ వేదికగా ఆమెను అభినందించారు.

 

ఏడాది క్రితం ఇరువురి మధ్య జరిగిన సమావేశాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి తాను ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పారు.న్యూజిలాండ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి ఆండ్రెన్ శనివారం నాడు ఘన విజయం సాధించారు.

శనివారం నాటికి 87 శాతం ఓట్లను లెక్కించారు. ఆండ్రెన్  కు చెందిన సెంటర్ -లెఫ్ట్ లేబర్ పార్టీ 48.9 శాతం ఓట్లను పొందింది. 1996 నుండి ఇప్పటివరకు ఈ మేరకు ఫలితం రాలేదని ఆ దేశ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.