ఆకాశంలో రెండు విమానాలు ఢీ...కుప్పకూలిన విమానం

First Published 5, Nov 2018, 12:05 PM IST
Plane Crashes In Mid-Air Collision at Ottawa
Highlights

కెనడాలో విమానప్రమాదం సంభవించింది. రెండు విమానాలు గాలిలోనే ఒకదానినొకటి ఢీకొట్టడంతో ఒక విమానం కూలిపోయింది. ఆదివారం ఉదయం సెస్నా ఎయిర్‌క్రాఫ్ట్‌‌కు చెందిన మధ్యశ్రేణి ప్రయాణికుల విమానం గమ్యస్థానానికి వెళుతుండగా రాజధాని ఒట్టవాకి సమీపంలోని కార్ప్ వద్ద... టర్బోప్రాప్ పీఏ-42 రకానికి చెందిన విమానాన్ని ఆకాశంలోనే ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తొలి విమానం కూలిపోగా.... పైలట్ దుర్మరణం పాలయ్యాడు.. రెండో విమానం క్షేమంగా ఒట్టవా అంతర్జాతీయ విమానాశ్రమంలో దిగింది. సమాచారం అందుకున్న వైమానిక సిబ్బంది.. విమానం కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించి సహాయక చర్యలను చేపట్టారు.
 
loader