నిత్యం నడుపుతున్నా కూడా పైలట్‌లు విమానం గాలిలో ఉన్నప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న ఏమరపాటు కూడా వందలమంది ప్రాణాలను గాలిలో కలిపేస్తుంది.

అయితే ఇవేమి పట్టించుకోని ఓ పైలట్ కాక్‌పిట్‌లో నిద్రపోయాడు. వివరాల్లోకి వెళితే... చైనా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 747 విమానం గాల్లో ఉండగానే సీనియర్ పైలట్ ఒకరు గుర్రుపెట్టి నిద్రపోయారు.

ప్రమాదమేమీ జరగపోయినప్పటికీ ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ పైలట్‌తో సహా మరొక వ్యక్తిని అధికారులు విధుల నుంచి తప్పించారు. అయితే కాక్‌పిట్‌లో ఈయన కునుకు  తీస్తోన్న సమయంలో తోటి పైలట్ వీడియో తీశాడే కానీ ఇతనిని నిద్రలేపే ప్రయత్నం చేయలేదు.

సదరు పైలట్‌ని తైవాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలట్ వెంగ్ జియాఘిగా గుర్తించారు. మరోవైపు వెంగ్ నిద్రపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.