కళాప్రియులకు పికాసో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన పేరు కనిపిస్తే చాలు ఆ చిత్రం కోట్లాది రూపాయలకు అమ్ముడుపోతుంది. అలాంటి అద్భుతమే న్యూయార్క్ లో జరిగింది. 

స్పెయిన్ కు చెందిన చిత్రకారుడు పాబ్లో పికాసో పెయింటింగ్ లకు ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మామూలు రోజుల సంగతి అటుంచితే కరోనా టైంలో కూడా ఆయన పెయింటింగ్ లకు ఏమాత్రం క్రేజ్ తగ్గకపోవడం గమనార్హం. 

ఆయన గీసిన ఓ చిత్రం తాజాగా వేలానికి వచ్చింది. వేలం మొదలైన కేవలం 19 నిమిషాల వ్యవధిలోనే 103.4 మిలియన్ డాలర్లకు (అటుఇటుగా 758 కోట్ల రూపాయలు) అమ్ముడు పోయింది. దీంతో వేలం వేసిన వ్యక్తులే ఆశ్చర్యపోయారు.

ఆన్లైన్లో వేలం పెట్టిన ఓ వేలం సంస్థ దీనిపై స్పందిస్తూ.. ఇంత ఎక్కువ ధరకు అమ్ముడు పోతుందని తాము కూడా అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కళాఖండానికి మేరీ థెరిసే అని పేరు పెట్టారు. అయితే దీనిని న్యూయార్క్‌కు చెందిన ఓ వేలం సంస్థ తాజాగా ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టింది.

కిటికీ లో కూర్చున్న ఓ మహిళ చిత్రాన్ని 1932లో పికాసో ఈ కళాఖండాన్ని గీశారు పికాసో. అని పేరు పెట్టారు అయితే కు చెందిన ఓ వేలం సంస్థ తాజాగా ఆన్లైన్లో వేలానికి పెట్టింది. ఆక్షన్ ప్రారంభించిన 19 నిమిషాల్లోనే 758 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ పెయింటింగ్‌ను ఎనిమిదేళ్ల క్రితం లండన్లో వేలానికి పెట్టగా 44.8 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.