మంకీపాక్స్ విషయంలో డబ్ల్యూహెచ్ఓ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. శృంగారం ద్వారా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని... వైరస్ సోకిన వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 

జెనీవా : కరోనా తరువాత ప్రపంచాన్ని భయపెడుతున్న మరో వైరస్ Monkeypox. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది.ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మంకీ పాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి physical contact ప్రధాన కారణమని పేర్కొంది. మంకీ పాక్స్ ఉన్నవారు ఇతరులతో శారీరకంగా కలవడం కారణంగా virus transmission అధికంగా ఉందని ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. తుంపర్ల ద్వారా మంకీ మంకీ పాక్స్ వ్యాపిస్తుందని చెప్పేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గతంలో మంకీ పాక్స్ వ్యాప్తి లేని దేశాల్లోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్న మాట వాస్తవమేనని, కానీ వాటిని నివారించవచ్చు అని తెలిపారు.

ఈ వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులను రక్షించేందుకు ఉత్తమ మార్గాలు ఉన్నాయని టెడ్రోస్ సూచించారు. ‘మంకీ పాక్స్ సోకినట్లు తేలితే హోం ఐసోలేషన్ లో ఉండాలి. ఇతరులకు దూరంగా ఉండాలి. ఆపై ఆరోగ్య కార్యకర్త ను సంప్రదించి కావలసిన చికిత్స తీసుకోవాలి. మంకీ పాక్స్ చికిత్సకోసం యాంటీవైరల్, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ సరఫరా పరిమితంగా ఉంది. అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఆ టీకాలు వైరస్ కు వ్యతిరేకంగా పని చేస్తూ ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. వాటి సరఫరా, పంపిణీ కోసం సమన్వయ యంత్రాంగాన్ని డబ్ల్యుహెచ్ఓ అభివృద్ధి చేస్తోంది’ అని ఆరోగ్య సంస్థ చీఫ్ తెలిపారు. మంకీ పాక్స్ నివారణకు సామూహిక వ్యాక్సినేషన్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

 ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తంగా 29 దేశాల్లో మంకీ పాక్స్ కేసులు వెలుగు చూసినట్లు సమాచారం. ఈ వైరస్ అధికంగా వ్యాపించే ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో దాదాపు వెయ్యి కేసులు బయటపడినట్లు డబ్ల్యుహెచ్వో నివేదికలు అందాయి. ఎన్నడు ఈ వైరస్ లేని దేశాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. మంకీ పాక్స్ మల్ల ఆఫ్రికాలో మొత్తం 66 మంది మృతి చెందారు. 

కాగా, మంకీపాక్స్ ఇంగ్లండ్‌లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నట్లు కనిపిస్తోందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ జూన్ 1న తెలిపింది. ఇది సాధారణంగా తేలికపాటి వైరల్ వ్యాధి. ఇది పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో స్థానికంగా కనిపిస్తుంది. అయితే వ్యాధి సోకిన వారితో సన్నిహిత సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఈ క్రమంలో మే ప్రారంభం వరకు, ఆఫ్రికా వెలుపల మంకీఫాక్స్ కేసులు చాలా అరుదుగా కనిపించాయి. అది కూడా ఆఫ్రికాకు వెళ్లి వచ్చినవారిలో అప్పుడప్పుడూ బయటపడ్డాయి. అయితే "ప్రస్తుతం ఈ మంకీ ఫాక్స్ వైరస్ వ్యాప్తి ఇంగ్లాండ్‌లో వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ వైరస్ వ్యాపించిన వారికి ఆఫ్రికాకు ప్రయాణించిన ట్రావెల్ హిస్టరీ లేదు" అని ఏజెన్సీ తెలిపింది

UKHSA ప్రకారం, యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెజారిటీ కేసులు -132 - ఇవి లండన్‌లో ఉన్నాయి, అయితే 111 కేసులు స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు లేదా పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న ఇతర పురుషులు. మహిళల్లో కేవలం రెండు కేసులు మాత్రమే ఉన్నాయి. ఈ మంకీఫాక్స్ లక్షణాలు కనిపించినవారిలో.. 21 రోజులలోపు విదేశీ ప్రయాణచరిత్ర ఉన్నవారున్నారు. యూరప్‌లోని వివిధ దేశాలకు ప్రయాణం చేసిన వారిలో 34ధృవీకరించబడిన కేసులు ఉన్నాయి. లేదా మే 31 నాటికి యునైటెడ్ కింగ్‌డమ్ ద్వారా నిర్ధారించబడిన 190 వ్యాధి కేసులలో దాదాపు 18శాతం అలా వ్యాపించినవే అని నివేదించబడ్డాయి. ఇప్పటివరకు , UKHSA బ్రిటన్, విదేశాలలో గే బార్‌లు, ఆవిరి స్నానాలు.. డేటింగ్ యాప్‌ల వినియోగానికి ఈ వ్యాధికి లింక్‌లను గుర్తించింది.