Asianet News TeluguAsianet News Telugu

చీటింగ్ చేయకుండా తలకు విచిత్రమైన హ్యాట్స్.. ఫిలిప్పీన్స్ విద్యార్థుల ఫొటోలు వైరల్

ఫిలిప్పీన్స్‌లో ఇంజినీరింగ్ విద్యార్థులు పరీక్షా కేంద్రంలో పొరుగునే ఉన్న విద్యార్థుల ఆన్సర్ షీట్లను చూడకుండా పర్ొఫెస్ మాండేన్ ఒర్టిజక్ కీలక ఐడియా ఇచ్చింది. విద్యార్థులంతా తమకు ఇష్టమైన రీతిలో హెడ్ గేర్లు తయారుచేసుకుని రావాలని, తద్వరా పొరుగు వారి సమాధానపత్రాలు కనిపించవని వివరించింది.
 

philippines students wears anti cheating headgears.. viral photos
Author
First Published Oct 24, 2022, 1:02 PM IST

న్యూఢిల్లీ: పరీక్షల్లో విద్యార్థులు చీటింగ్ చేయకుండా చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఇన్విజిలేటర్ ఎప్పుడూ పరీక్షలు రాసే విద్యార్థులపైనే కన్నేసి ఉంచుతారు. ఎగ్జామ్ సెంటర్ మొత్తం కలియ తిరుగుతూ విద్యార్థులను క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు వారిని అడ్డుకోవడం సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడటానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన బైకోల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరిగ్ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ మేరీ జాయ్ మాండేన్ ఒర్టిజ్ అనూహ్య ఐడియాకు తెరలేపారు.

పొరుగు విద్యార్థి ఆన్సర్ షీట్ నుంచి సమాధానాలు చూసి తస్కరించకుండా ఉండటానికి విద్యార్థులందరూ తలపై ప్రత్యేక టోపీలు ధరించుకు రావాలని ఆదేశించింది. లెగాజ్పి సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఈ ఆదేశాలు ఇచ్చింది. సాధారణ పేపర్ల ద్వారా హెడ్ గేర్ తయారుచేసుకుని.. పొరుగు వైపు దృష్టి వెళ్లకుండా ఆగేలా ఆ నిర్మాణాలు ఉండాలని సూచించింది.

Also Read: లేడీ ఖిలాడీ.. అపార్ట్‌మెంట్‌లో గది అద్దాలను బయటి నుంచి క్లీన్ చేసిన మహిళ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు రెస్పాన్స్‌గా విద్యార్థులు వారి సృజనాత్మకతకు పదును పెట్టారు. వారంతా వారి చుట్టూ వేస్ట్‌గా పడి ఉన్న కార్డ్ బోర్డులు, ఎగ్జ బాక్సులు, ఇతర పేపర్లు, రిసైకిల్డ్ మెటీరియల్స్‌ను ఇందుకోసం వినియోగించుకున్నారు. విభిన్న రీతుల్లో హ్యాట్స్ తయారు చేసుకు వచ్చారు. మిడ్ ఎగ్జామ్స్ ఆ విచిత్ర టోపీలు ధరించే రాశారు. సదరు ప్రొఫెసర్ వారి ఫొటోలను తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ ఫొటోలు వెంటనే వైరల్ అయ్యాయి.

బీబీసీతో ప్రొఫెసర్ మండేన్ ఒర్టిజ్ మాట్లాడుతూ, తరగతిలో విద్యార్థులు తమ ఇంటిగ్రిటీ, ఆనెస్టినీ కాపాడుతూనే సరదాగా కనిపించే దారి కోసం తాను చూశానని వివరించారు. తన ఐడియా నిజంగా చాలా ప్రభావవంతంగా మారిందని తెలిపారు. 

పేపర్‌తో చాలా సింపుల్ డిజైన్‌లు తీసుకురావాలని తాను విద్యార్థులకు విజ్ఞప్తి చేశానని వివరించారు. కాగా, కొందరు విద్యార్థులు నిజంగానే అద్భుత రీతిలో వాటిని తయారు చేసుకు వచ్చి అబ్బురమనిపించారు. 

థాయ్‌లాండ్‌లో కొన్ని ఏళ్ల క్రితం ఇలాంటి ఓ టెక్నిక్ చూశానని ఆమె వివరించారు. ఆ టెక్నిక్ ద్వారానే తాను ప్రేరణ పొందానని తెలిపారు. చెవులకు ఫ్లాప్స్ పెట్టుకుని పొరుగు వారి పేపర్లు కనిపించకుండా ఏర్పాటు చేసుకున్న పరదా వంటివి పరీక్షల్లో విద్యార్థులు వినియోగించుకున్నారని చెప్పారు. వాటిని ప్రేరణగా తీసుకునే ఈ ఐడియా ఇచ్చినట్టు వివరించింది.

Also Read: వాల్‌మార్ట్ స్టోర్‌లో రెండు మహిళా గ్రూపుల మధ్య కుమ్ములాట.. పోల్స్, షూస్‌లతో దాడి.. వీడియో వైరల్

అంతేకాదు, తన ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన ఇచ్చారని ఆమె తెలిపారు. కఠిన పరీక్ష నిబంధనలతో వారు మరింత కష్టపడి చదివారని చెప్పారు. అందుకే కొందరైతే టైమ్ పూర్తికాకముందే సమాధాన పత్రాలు ఇచ్చి వెళ్లారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సారి ఎవ్వరూ చీటింగ్ చేయలేదని తెలిపారు. మొత్తంగా ఈ ఫొటోలు సూపర్ అని.. విద్యార్థుల క్రియేటివిటీ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్లు వస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios