ఈ ఏడాది అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్: పైజర్ సీఈఓ

ఈ ఏడాది అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి వస్తోందని నమ్ముతున్నామని అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ ప్రకటించింది. తాజా నివేదికల ప్రకారంగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నామన్నారు.

Pfizer CEO claims COVID-19 vaccine could be ready by October end, says report


న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి వస్తోందని నమ్ముతున్నామని అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ ప్రకటించింది. తాజా నివేదికల ప్రకారంగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నామన్నారు.

ఫైజర్ సీఈఓ అల్బర్ట్ బౌర్లా ఈ మేరకు ఈ విషయాన్ని ప్రకటించారని  టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ అనే పత్రిక కథనం ప్రచురించింది. ఈ మేరకు జర్మన్ సంస్థ బయోన్‌టెక్ తో కలిసి పనిచేస్తున్నట్టుగా ప్రకటించింది.

ఈ ఏడాది చివరి నాటికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యాక్సిన్స్ రావడం ప్రారంభం కానుందని ఆస్ట్రాజెనెకా అధిపతి అధినేత పాస్కల్ సోరియట్ పేర్కొన్నట్లుగా రిపోర్టు చేసింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ భాగస్వామ్యంతో అస్ట్రాజెనెకా తో  వ్యాక్సిన్ తయారికి కృషి చేస్తున్నామని ప్రకటించింది.

ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ సిద్దమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా  సుమారు 100కి పైగా సంస్థలు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలను చేస్తున్నాయి. 

also read:ల్యాబ్ టెక్నీషీయన్‌పై దాడి: కరోనా అనుమానితుల శాంపిల్స్‌ ఎత్తుకెళ్లిన కోతులు

ఇప్పటికే కొన్ని సంస్థలు తమ పరిశోధనల్లో ప్రగతి ఉందని ఆ సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆక్స్ ఫర్డ్ సంస్థ కోతులపై చేసిన పరిశోధనలు సక్సెస్ అయినట్టుగా ప్రకటించాయి. మనుషులపై తమ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నట్టుగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించింది. 

ఈ యూనివర్శిటీతో కలిసి పుణెకు చెందిన సీరమ్ సంస్థ కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు మరికొన్ని సంస్థలు కూడ తమ ప్రయోగాలు ఫలవంతంగా ముందుకు సాగుతున్నట్టుగా ప్రకటించాయి. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేవరకు కూడ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios