లూసియానాలో అద్భుతం జరిగింది. ఓ పదేళ్ల అమ్మాయి కిడ్నాప్ అయ్యింది. ఎంత వెతికినా దొరకలేదు. అయితే ఆ పాప మరో వ్యక్తితో కలిసి సిల్వర్ కలర్ 2012 నిస్సాన్ అల్టిమాలో వెళ్లిందని సీసీ టీవీ ఆధారాలతో తేలింది.
లూసియానాలో అద్భుతం జరిగింది. ఓ పదేళ్ల అమ్మాయి కిడ్నాప్ అయ్యింది. ఎంత వెతికినా దొరకలేదు. అయితే ఆ పాప మరో వ్యక్తితో కలిసి సిల్వర్ కలర్ 2012 నిస్సాన్ అల్టిమాలో వెళ్లిందని సీసీ టీవీ ఆధారాలతో తేలింది.
దీని ప్రకారం పోలీసులు గాలిస్తున్నారు. లూసియానా అంతటా జల్లెడ పడుతున్నారు. కానీ కారు కానీ దాని ఆనవాళ్లు కానీ దొరకలేదు. ఈ నేపథ్యంలో డియోన్ మెరిక్ అనే మున్సిపల్ కార్మికుడు చెత్త డబ్బాలు తీసే క్రమంలో లూసియానాలోని సెయింట్ మార్టిన్ పారిష్‌లోని బర్టన్ ప్లాంటేషన్ హైవే వెంట వెడుతున్నాడు.
అంతలో దూరంగా ఓ చెట్టుకింద మైదానంలో ఓ సిల్వర్ కలర్ కారు కనిపించింది. టీవీల్లో చెబుతోంది ఆ కారేమోనని అనుమానం వచ్చింది. అందులోనే ఆ పదేళ్ల బాలిక ఉండొచ్చని డౌట్ తో అక్కడి ఎమర్జెన్సీ సర్వీస్ అయిన 911 కి కాల్ చేశాడు.
ఆ తర్వాత ఫేస్బుక్ లైవ్ పెట్టాడు. ఆ కారును, పోలీసులను చూపిస్తూ తన ఎమోషన్స్ ని పంచుకున్నాడు. ఆ కారు నాకు కొంచెం తేడాగా అనిపించింది. కారు అద్దాలు బైటికి కనిపించకుండా కలర్ గా ఉన్నాయి. ఒకవేళ ఆ పదేళ్ల పాప ఇందులో ఉండి ఉండొచ్చనే అనుమానం వచ్చింది.. అంటూ లైవ్ లో చెప్పుకొచ్చాడు.
ఆ లైవ్ లో వెనక పోలీసులు కారు దగ్గరికి వెళ్లడం, డోరు బలవంతంగా తెరవడం.. అందులోనుండి పాపను రక్షించడం కనిపిస్తుంది. ఆ పదేళ్ల పాప ఆదివారం మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయింది. డియోన్ చొరవతో ఆ పాప దొరికింది.
అయితే డియోన్ ను గమనించిన ఆ కారులోని నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ డియోన్ తన చెత్త ట్రక్కుతో అతడ్ని అడ్డుకుని పారిపోకుండా చేశాడు. డియోన్ కాల్ చేసిన కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడైన 33 యేళ్ల మైఖేల్ సెరియల్‌ను అరెస్టు చేశారు.
డియోన్ మెరిక్ సంతోషంతో కంటతడి పెట్టాడు. ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ మీరు ఎంత ధనవంతులైనా కావచ్చు కానీ ఇలాంటి అనుమానాస్పదంగా కనిపించినప్పుడు 911కి ఒక్క కాల్ చేయండి అంటూ అభ్యర్థించాడు.
డియోన్ మెరిక్ చేసిన ఈ పనికి అతను పనిచేస్తున్న పెరిక్ సంస్థ సిఇఒ రోడి మాథర్న్ హర్షం వ్యక్తం చేశారు. రోడి మాథర్న్ ఒక ప్రకటనలో సంస్థ మెరిక్, అతనితోపాటు ఉన్న ఆంటోయిన్‌ల పనికి ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.
నిజానికి మా పెలికాన్ వేస్ట్ బృందం సభ్యులు మహమ్మారి సమయంలో కూడా నిబద్ధతతో వృత్తి చేశారని గొప్పగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు చేసిన విషయం అసాధారణం అన్నారు.
నిందితుడు సెరియల్ ఐబీరియాను పారిష్ జైలుకు తరలించారు. ఇతనిమీద తీవ్ర అపహరణ ఆరోపణలను ఉన్నాయి. దోషిగా తేలితే, లూసియానా చట్టం ప్రకారం లైంగిక నేరస్తుడిగా పేర్కొంటూ.. పెరోల్ లేని కఠిన జీవితఖైదు పడుతుంది. అయితే సెరియల్ తన తరఫున న్యాయవాది ఉన్నారా అనేది తెలియదు.
ఇక మెరిక్ పోలీసులకు తన వాంగ్మూలం ఇవ్వడానికి ముందు ఆ పాపకు ఆకలిగా ఉంటే తనకు ఆహారం కూడా కొనిస్తా అంటూ చెప్పడం అందర్నీ హత్తుకుంది.
