Asianet News TeluguAsianet News Telugu

మోడీ మళ్లీ ప్రధాని కాకూడదు.. పాకిస్తాన్ నటుడి సంచలన వ్యాఖ్యలు

భారత ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోదీ (narendra modi) తప్పుకోవాలని పాకిస్థాన్ సినీ పరిశ్రమలోని (pakistan filmy industry) వారు కోరుకుంటున్నారని పాక్ నటుడు జావేద్ షేక్ (javed sheikh) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌లో మోడీని ఓడించాలని ఆయన ఆకాంక్షించారు. 

people of pakistan film industry wants modi to lose in 2024 election says actor javed sheikh
Author
Islamabad, First Published Jan 4, 2022, 9:07 PM IST

భారత ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోదీ (narendra modi) తప్పుకోవాలని పాకిస్థాన్ సినీ పరిశ్రమలోని (pakistan filmy industry) వారు కోరుకుంటున్నారని పాక్ నటుడు జావేద్ షేక్ (javed sheikh) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌లో మోడీని ఓడించాలని ఆయన ఆకాంక్షించారు. మోడీ భారతదేశానికి మళ్లీ  ప్రధాన మంత్రి అయితే, పాకిస్తానీ సినీ తారలు భారతీయ సినిమాలో భాగం కాలేరని మండిపడ్డారు.

జావేద్ షేక్ ‘‘ఓం శాంతి ఓం’’ సహా పలు భారతీయ సినిమాల్లో నటించారు. ఓం శాంతి ఓం చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌‌కు (shahrukh khan) తండ్రిగా నటించాడు. భారతీయ సినిమాలో భాగం కావడం సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఆ అవకాశాలు తగ్గిపోయాయని జావేద్ అన్నారు. మోదీ ప్రధానిగా తప్పుకుంటేనే మరింత మంది పాకిస్థానీ నటులు భారతీయ సినిమాల్లో భాగం కాగలరని జావేద్ షేక్ ఆకాంక్షించారు. అయితే ఈ మధ్య అనురాగ్ కశ్యప్ (anurag kashyap) దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్‌లో పాకిస్థానీ నటీనటులు నటించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 

కాగా.. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 2019 ఫిబ్రవరిలో సీఆర్ పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిపై దేశంలో నిరసన జ్వాలలు ఎగిసిపడిన సంగతి తెలిసిందే.  ఈ సంఘటనకు పాకిస్థాన్, ఆ దేశానికి చెందిన ఉగ్రవాదులే కారణమని భారతీయులు ఊగిపోయారు. ఈ నేపథ్యంలోనే మనదేశానికి చెందిన కొన్ని వ్యాపార - వాణిజ్య సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్ తో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలను ఒక్కొక్కటిగా తెంచేసున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌తో 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' హోదాను భారత్ ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశం నుంచి దిగుమతి చేసే వస్తువులపై 200 కస్టమ్స్ డ్యూటీని విధించిన విషయం తెలిసిందే.

అదే సమయంలో ఈ నిరసన సెగ బాలీవుడ్ కు కూడా తగిలింది. పాకిస్థాన్ కు చెందిన సినిమా - టీవీ నటులు - సింగర్లకు బాలీవుడ్ లో అవకాశం ఇవ్వరాదని ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. భారతీయ సినిమాల్లో వారికి అవకాశం ఇచ్చినట్లు తెలిస్తే సెట్‌కు వచ్చి తగలబెడుమని హెచ్చరించింది. జవాన్ల వీరమరణంతో దేశం మొత్తం దిగ్బ్రాంతికి లోనైందని ఈ నేపథ్యంలోనే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని బాలీవుడ్ ప్రముఖులు తెలిపారు. అప్పటి నుంచి భారతీయ సినిమాల్లో పాకిస్తాన్ నటీనటులు, టెక్నీషీయన్లకు అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలో మరోసారి ప్రధానిగా  నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడితే.. బాలీవుడ్ తలుపులు పూర్తిగా మూసుకుపోతాయని .. పాక్ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జావెద్ పై విధంగా వ్యాఖ్యానించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios