Asianet News TeluguAsianet News Telugu

విమాన ప్రయాణం చేస్తుండగా మాస్క్ ధరించమంటే వాదనకు దిగాడు.. పైలట్లు ఏం చేశారంటే..!

అమెరికా నుంచి లండన్‌కు వెళ్లుతున్న ఓ విమానంలో ప్రయాణికుడు మాస్క్ ధరించాలని పలుమార్లు కోరినా అందుకు ససేమిరా అన్నాడు. మాస్క్ ధరించడం అమెరికాన్ ఫెడరల్ ప్రభుత్వ నిబంధన. కానీ, ఈ నిబంధన పాటించడానికి గురువారం ఓ ప్రయాణికుడు అంగీకరించలేదు. దీంతో సదరు ఎయిర్‌లైన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే విమానాన్ని వెనక్కి రప్పించింది. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే సదరు ప్రయాణికుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
 

passenger refused to wear mask.. flight turns back
Author
New Delhi, First Published Jan 21, 2022, 12:58 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) ఒక దేశం నుంచి మరో దేశానికి వేగానికి వ్యాపించడానికి వాహకాలుగా విమాన ప్రయాణాలే ఉన్నాయి. అంతర్జాతీయ ప్రయాణికుల(International Passenger)తో మహమ్మారి వేగంగా ఇతర దేశాలకు ప్రబలుతున్నదనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకినట్టు వారికి తెలియకున్నా.. టెస్టులో కనిపించకున్నా.. వారు ప్రయాణించే మరో దేశంలోకి వైరస్‌ను తమ వెంటే తీసుకెళ్లినట్టే అవుతుంది. అందుకే, ఎన్ని నిబంధనలు పెట్టినా.. చాలా సార్లు దేశాలు విమాన ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నాయి. ఒమిక్రాన్ కొత్తగా వెలుగులోకి వచ్చినప్పుడూ మరోసారి ప్రపంచ దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. క్రమంగా చాలా నిబంధనలతో అంటే.. టెస్టు రిపోర్టులు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, కరోనా నిబంధనల పాలన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ ప్రయాణాలను పునరుద్ధరిస్తున్నాయి. అత్యధిక వేగంతో వ్యాపించి ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్న ప్రస్తుత కాలంలో ఓ అంతర్జాతీయ ప్రయాణికుడు విమాన ప్రయాణం చేస్తూ మాస్క్ ధరించడానికి తిరస్కరించాడు. దాంతో ఆ పైలట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలోని మయామి నుంచి లండన్‌కు గురువారం జెట్ లైనర్ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 777 విమానం బయల్దేరింది. అందులో సుమారు 129 మంది ప్రయాణికులు ఉన్నారు. 14 మంది క్రూ ఉన్నారు. విమానం గాల్లోకి ఎగిరి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఓ ప్రయాణికుడు మాస్క్(Mask) ధరించలేదని క్రూ గమనించారు. వెంటనే ఆయన వద్దకు వెళ్లి మాస్క్ ధరించాల్సిందిగా కోరారు. కానీ, ఆయన మాస్క్ ధరించడానికి తిరస్కరించాడు. విమానంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నవారు తప్పకుండా మాస్క్ ధరించాలన్నది అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిబంధన. ఈ విషయాన్ని గుర్తు చేసినా.. ఆ ప్రయాణికుడు మాస్క్ పెట్టుకోవడానికి ససేమిరా అన్నాడు. ఎంత నచ్చజెప్ప ప్రయత్నించినా మాస్క్ పెట్టుకోలేదు. దీంతో ఎయిర్‌లైన్ కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆ విమానాన్ని వెనక్కి రప్పించాల్సిందిగా నిర్ణయించుకుంది.

లండన్‌కు వెళ్లాల్సిన ఆ విమానాన్ని పైలట్లు మళ్లీ తిరిగి మయామికే వెళ్లిపోయింది. ఈ విషయాన్నే స్థానిక పోలీసులకూ ఎయిర్‌లైన్ అధికారులు చెప్పారు. దీంతో ఆ విమానం కోసం ఎయిర్‌పోర్టులో పోలీసులు ఎదురుచూశారు. ఆ విమానం విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే సదరు ప్రయాణికుడు పోలీసులు వెంటపెట్టుకుని వెళ్లిపోయారు. ఎలాంటి గొడవ జరగకుండా ప్రయాణికుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ జరుగుతున్నదని ఆ అమెరికన్ ఎయిర్‌లైనర్ తెలిపింది. అయితే, ఆ ప్రయాణికుడు తమ సంస్థ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించినట్టు పేర్కొంది.

విమాన ప్రయాణంలో మాస్క్ ధరించకుండా.. ఇతర కరోనా నిబంధనలు పాటించకుండా ప్రయాణికులు గొడవపడటం ఇదే తొలిసారి కాదు. మాస్క్ ధరించాలని కోరితే.. ప్రయాణికులు కొందరు వాగ్వాదానికి దిగడం, భౌతిక దాడికి పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులను ఫ్లైట్ అటెండాంట్స్ ఇటీవలి కాలంలో ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన ఓ మహిళ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు గొంతులో గరగరగా అనిపించడంతో అనుమానంతో టాయిలెట్‌కు వెళ్లి ర్యాపిడ్ టెస్టు చేసుకున్నారు. అందులో తనకు కరోనా సోకినట్టుగా రిపోర్ట్ వచ్చింది. విమానం నిండా ప్రయాణికులే. ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. పాజిటివ్ వచ్చిన ఆ మహిళ ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక సతమతం అయింది. ఫ్లైట్ అటెండాంట్ సహకారంతో ప్రయాణికులకు దూరంగా ఒంటరిగా ఉండే సీటు కోసం వెతికింది. కానీ, సాధ్యపడకపోవడంతో టాయిలెట్‌(Toilet)నే ఐసొలేషన్ సెంటర్‌గా ఎంచుకుంది. ఫ్లైట్(Flight) ల్యాండ్ అయ్యే వరకు ఆ టాయిలెట్‌లోనే ఆమె తనను తాను ఐసొలేట్ చేసుకుంది. డిసెంబర్ 19న ఈ ఘటన చోటుచేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios