Asianet News TeluguAsianet News Telugu

మాటలు నేర్చి వుస్కో అంది, స్మగ్లర్లు పరార్: చిలుక అరెస్ట్

డ్రగ్స్ కేసులో చిలుకను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన బ్రెజిల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి పోలీసులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. 

parrot arrested in brazil for helping smugglers
Author
Brazil, First Published Apr 26, 2019, 1:08 PM IST

డ్రగ్స్ కేసులో చిలుకను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన బ్రెజిల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి పోలీసులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్‌ను సరఫరా చేస్తున్నారన్న సమాచారం అందింది.

దీంతో ఆ ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. వీరి రాక స్మగ్లర్లకు సైతం తెలియదు. అయితే గుమ్మం వద్ద పంజరంలో ఉన్న చిలుక పోలీసుల రాకను పసిగట్టింది. వెంటనే ‘‘మమ్మా.. పోలీస్ ’’ అని అరిచింది.

దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు దొడ్డి దారిన పారిపోయారు. నేరస్థుల ఆటకట్టించబోతున్నామని సంబర పడిన పోలీసులకు లోపలికి వెళ్లగానే నిరాశే ఎదురైంది. అక్కడ ఎవరు లేకపోగా.. పంజారంలో చిలుక కనిపించింది. స్మగ్లర్లు పారిపోవటానికి చిలుకే కారణమని నిర్థారించుకున్న పోలీసులు వెంటనే దానిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

అనంతరం న్యాయస్థానంలో విచారణకు హాజరైన చిలుక నోరు మెదపలేదట. దీనికి తోడు దానిని వదిలిపెట్టాలంటూ పర్యావరణ, పక్షి ప్రేమికుల నుంచి డిమాండ్లు రావడంతో పోలీసులు దానిని స్ధానిక జంతు ప్రదర్శన శాలకు అప్పగించారు.

బ్రెజిల్‌‌లో డ్రగ్స్ సరఫరాదారులు జంతువులను ఉపయోగించడం నిత్యకృత్యమే అయినా.. పక్షుల్ని వినియోగించడం మాత్రం ఇదే మొదటిసారి అని అక్కడి పోలీసులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే స్మగ్లర్లు శిక్షణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios