Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ మ్యూజిక్ వింటూ సెల్ఫీ.. ఉద్యోగం పొగట్టుకున్న పాక్ యువతి

సంగీతానికి సరిహద్దులు ఉండవంటారు.. కానీ భారత్ అన్నా.. భారతీయ సంగీతం అన్నా ఆగ్రహం వ్యక్తం చేసే పాకిస్తాన్‌లో మాత్రం ఇండియన్ మ్యూజిక్‌కు స్థానం లేదు. అలా విన్న వారిపై కఠిన చర్యలు తప్పవని మరోసారి రుజువయ్యింది

Pakistani girl dance with Indian song suspend from job
Author
Pakistan, First Published Sep 4, 2018, 3:43 PM IST

సంగీతానికి సరిహద్దులు ఉండవంటారు.. కానీ భారత్ అన్నా.. భారతీయ సంగీతం అన్నా ఆగ్రహం వ్యక్తం చేసే పాకిస్తాన్‌లో మాత్రం ఇండియన్ మ్యూజిక్‌కు స్థానం లేదు. అలా విన్న వారిపై కఠిన చర్యలు తప్పవని మరోసారి రుజువయ్యింది. బాలీవుడ్ పాట వింటూ సెల్ఫీ వీడియో తీసుకున్న ఓ యువతి తన ఉద్యోగాన్ని కోల్పోయింది. 25 ఏళ్ల వయసున్న యువతి సియాల్‌కోట్ విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్ సెక్యూరిటీ ఫోర్స్ (ఏఏఎఫ్)‌ మహిళా విభాగంలో పనిచేస్తోంది.

ఓ రోజు సరదాగా ఓ భారతీయ పాటను హమ్ చేస్తూ... సెల్ఫీ వీడియో తీసుకుని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈమె పాట పాడే విధానం.. ఎక్స్‌ప్రెషన్స్ అక్కడి యువతకు బాగా నచ్చడంతో బాగా షేర్ అయ్యింది. అయితే పాకిస్తాన్ జెండా ఉన్న టోపీతో ఆమె డ్యాన్స్ చేయడాన్ని అక్కడి మీడియా బాగా ఫోకస్ చేయడం.. యూనిఫామ్‌లో ఉండి భారతీయ పాటకు పెదాలు కదపడంతో ఏఏఎఫ్ మండిపడింది.

ఇందుకు శిక్షకు ఆమెను రెండేళ్ల పాటు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంతే కాకుండా భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు.. అలాగే భారతీయ పాటలు వినడం, సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం లాంటివి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తమ సిబ్బందికి సైతం ఆదేశాలు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios