ఇస్లామాబాద్:  మనీలాండరింగ్ కేసులో  పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు  ఆసీఫ్ అలీ జర్ధారీ ని  పాక్ (ఎన్ఏబీ) అధికారులు సోమవారం నాడు రాత్రి అరెస్ట్ చేశారు.

పాక్ మాజీ అధ్యక్షుడు జర్ధారీ అతని  సోదరి మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనీ లాండరింగ్ నిమిత్తమై జర్దారీ అతని సోదరి తప్పుడు పత్రాలతో బ్యాంకు ఖాతాలను తెరిచారనే ఆరోపణలు ఉన్నాయి.

 అయితే ఈ ఆరోపణలను జర్దారీతో పాటు ఆయన సోదరి కూడ ఖండించారు. రాజకీయ కుట్రతోనే ఈ ఆరోపణలు చేశారని ఆయన ఆరోపించారు.  జర్దారీని అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కోసం ఆయన చేసిన ధరఖాస్తును ఇస్లామాబాద్ కోర్టు తిరస్కరించింది.

దేశంలోని పేద ప్రజల పేరిట పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్న విషయాన్ని  గత ఏడాది  అధికారులు గుర్తించారు. ఈ విషయమై పాకిస్తాన్ సుప్రీంకోర్టు  గత ఏడాది సెప్టెంబర్ మాసంలో  విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ఈ తప్పుడు బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు 400  మిలయన్ డాలర్ల లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు.