పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా పాజిటివ్ గా తేలింది. రెండు రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తీసుకున్నారు. కాగా శనివారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో  ఇమ్రాన్ ఖాన్ పాజిటివ్‌ గా నిర్థారణ అయ్యింది. దీన్ని పాకిస్తాన్ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ "ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్" లో ఉన్నారని మంత్రి ఫైసల్ సుల్తాన్ ఒక ట్వీట్ లో తెలిపారు. ప్రధాని కార్యాలయం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

మార్చి 18 న ఇమ్రాన్ ఖాన్ చైనా తయారీ ఐన సినోవాక్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో కరోనావైరస్ కేసుల పెరుగుదలను నివారించేలా నిబంధనలు ఫాలో కావాలని దేశ పౌరులను కోరారు. దేశ ప్రధానిగా తాను ఇందులో భాగంగా  COVID-19 మొదటి టీకాను తీసుకున్నారు.  

220 మిలియన్ల జనాభా కలిగిన పాకిస్తాన్ లో కరోనా కేసులు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి.