కశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్ధితులు, ఏడుగురు పాక్ సైనికులను భారత సైన్యం హతమార్చడం వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.

మధ్యాహ్నం 3 గంటలకు  జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి హాజరవ్వాల్సిందిగా ఆయన అధికారులు, మంత్రులను ఆదేశించారు. నియంత్రణ రేఖ వెంబడి భారత్ క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తుందన్న ఆ దేశ సైనిక విభాగం ఆరోపణలపై ఈ సమావేశం చర్చించే అవకాశం వుంది.

అయితే తాము క్లస్టర్ బాంబులు వుపయోగిస్తున్నామన్న పాక్ వాదనలను భారత్ తిప్పికొట్టింది. పాక్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషి పోస్ట్ చేసిన చిత్రాలు మోర్టారు కాల్పులు, క్లస్టర్ బాంబు పేలుళ్లవి కాదని భారత సైన్యం తెలిపింది. మరోవైపు భారత్ కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 35ఏ, 370 రద్దు చేస్తే..తమకు కష్టకాలం వస్తుందని పాక్ ఆందోళన చెందుతోంది. 

భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నం: ఏడుగురు పాక్ సైనికులు హతం

తెల్లజెండాలతో వచ్చి సైనికుల మృతదేహాలు తీసుకెళ్లండి: పాక్‌కు భారత్ ఆఫర్

కశ్మీర్‌ లోయను జల్లెడపడుతున్న సైన్యం: నలుగురు జైషే ఉగ్రవాదులు హతం