మోదీ చివరి కార్డ్‌ను వినియోగించారని అందుకు మోదీ, బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కశ్మీర్ అంశాన్ని వారు అంతర్జాతీయం చేయడమే ఇందుకు కారణమంటూ చెప్పుకొచ్చారు ఇమ్రాన్ ఖాన్. ఒకవేళ తమ దేశం జోలికి భారత్ వస్తే అందుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
ఇస్లామాబాద్: భారత్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. జమ్ముకశ్మీర్ విభజన అనంతరం భారత్ పై ఇమ్రాన్ ఖాన్ తోపాటు పలువురు మంత్రులు సైతం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తమ వక్రబుద్దిని బయటపెట్టుకుంటున్నారు.
తాజాగా మరోసారి భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్. పాక్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్ అసెంబ్లీలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ జమ్ము కశ్మీర్ అంశంపై మాట్లాడారు.
ఇకపై తాను కశ్మీర్ గొంతుకనై ఐక్యరాజ్యసమితి సహా ప్రతి అంతర్జాతీయ వేదికపైనా గళాన్ని వినిపిస్తానని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన సరికాదంటూ విరుచుకుపడ్డారు.
జమ్ము కశ్మీర్ విభజన అంశంపై అంతర్జాతీయ సమాజం పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్. ఇరు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే అందుకు వారిదే బాధ్యత అంటూ భారత్ కు హెచ్చరించారు.
జమ్ము కశ్మీర్ అంశాన్ని ప్రతి అంతర్జాతీయ వేదికపైనా తాను ఒక రాయబారిగా వ్యవహరించి గళమెత్తుతానని తెలిపారు. జమ్ము కశ్మీర్ విషయంలో భారత్ వ్యూహాత్మక తప్పిదం చేసిందని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా తప్పిదం చేశారని అభిప్రాయపడ్డారు.
మోదీ చివరి కార్డ్‌ను వినియోగించారని అందుకు మోదీ, బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కశ్మీర్ అంశాన్ని వారు అంతర్జాతీయం చేయడమే ఇందుకు కారణమంటూ చెప్పుకొచ్చారు ఇమ్రాన్ ఖాన్.
ఒకవేళ తమ దేశం జోలికి భారత్ వస్తే అందుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. అందుకు తమ సైనిక బలగం మొత్తం వినియోగిస్తామని చెప్పుకొచ్చారు. తమపై దాడికి ఇప్పటికే భారత్ ప్రణాళిక రచించిందని ఆరోపించారు.
ఒకవేళ ఎలాంటి చర్యలకు పాల్పడినా ప్రతి ఇటుకకూ ఒక్కో రాయితో సమాధానం చెబుతామంటూ ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ముస్లింలే లక్ష్యంగా మూక దాడులు జరుగుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పాక్ స్వాతంత్య్ర దినోత్సవం: సంప్రదాయానికి ఇమ్రాన్ సర్కార్ తూట్లు
ఇండియాపై జీహాద్ చేయాల్సిందే: పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు
పాక్‌కు మరో షాక్: కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వానికి ట్రంప్ గుడ్‌బై
ఆర్టికల్ 370 రద్దు: ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, పాక్ విదేశాంగ మంత్రి ఆక్రోశం
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 14, 2019, 7:21 PM IST