న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుల నేపథ్యంలో భారత్ పై విషం చిమ్ముతోంది పాకిస్తాన్. భారత్ పై నిత్యం అక్కసు వెల్లగక్కుతూనే ఉంది. తాజాగా  పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అట్టారి - వాఘా సరిహద్దు వద్ద స్వీట్లు పంచుకునే ఆనవాయితీకి తూట్లు పొడిచింది. 

బక్రీద్‌ పర్వదినం సందర్భంగా అట్టారి-వాఘా సరిహద్దు వద్ద స్వీట్లు బీఎస్ఎఫ్ దళాలు, పాక్ రేజంర్లు స్వీట్లు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. బక్రీద్ పర్వదినాన కూడా స్వీట్లు పంచుకునేందుకు పాకిస్తాన్ ముందుకు రాలేదు. 

తాజాగా పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా భారత్ తో స్వీట్లు పంచుకోలేదు పాకిస్తాన్. పాక్‌ రేంజర్లకు స్వీట్లు ఇచ్చేందుకు భారత్ బీఎస్‌ఎఫ్‌ బలగాలు ప్రయత్నించినప్పటికీ పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో బోర్డర్ లో ఉన్న సంప్రదాయాలకు పాకిస్తాన్ తూట్లు పొడిచినట్లైంది. 

ఇకపోతే జమ్ముకశ్మీకు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన తర్వాత భారత్ తో అన్ని సంబంధాలను తెంచేసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం. జాతీయ భద్రతా మండలి సమావేశంలో భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్‌ తెంచేసుకుంటున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  

అంతేకాదు వినోద రంగానికి చెందిన అన్ని రకాల సాంస్కృతిక మార్పిడిలు, కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు పాక్‌ స్పష్టం చేసింది. మరోవైపు సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ సేవలు, థార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలతో పాటు లాహోర్‌ - ఢిల్లీ ఫ్రెండ్‌షిఫ్‌ బస్సు సర్వీసులను కూడా పాకిస్తాన్ నిలిపివేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇండియాపై జీహాద్ చేయాల్సిందే: పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు

పాక్‌కు మరో షాక్: కాశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వానికి ట్రంప్ గుడ్‌బై

ఆర్టికల్ 370 రద్దు: ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, పాక్ విదేశాంగ మంత్రి ఆక్రోశం