Asianet News TeluguAsianet News Telugu

కుప్పకూలిన గ్రిడ్: గంటలుగా అంధకారంలో మగ్గుతున్న పాకిస్తాన్

దాయాది దేశం పాకిస్తాన్‌ చిమ్మచీకట్లు అలుముకున్నాయి. అక్కడ పవర్‌గ్రిడ్‌ కుప్పకూలడంతో రాజధాని ఇస్లామాబాద్‌తో సహా దాదాపు దేశం మొత్తం అంధకారంలో మునిగిపోయింది

Pakistan power cut plunges country into darkness ksp
Author
Islamabad, First Published Jan 10, 2021, 4:11 PM IST

దాయాది దేశం పాకిస్తాన్‌ చిమ్మచీకట్లు అలుముకున్నాయి. అక్కడ పవర్‌గ్రిడ్‌ కుప్పకూలడంతో రాజధాని ఇస్లామాబాద్‌తో సహా దాదాపు దేశం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11:41 నిముషాలకు దక్షిణ పాకిస్థాన్‌లోని గ్రిడ్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు ప్రాథమిక విచారణ నివేదిక చెబుతోంది.  

ఈ సాంకేతిక లోపం కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ ప్లాంట్లు వరుసగా మూతపడ్డాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా 21 కోట్ల మంది అంధకారంలో మగ్గుతున్నారు. రాజధాని ఇస్లామాబాద్‌, ఆర్థిక రాజధాని కరాచీ, మరో ముఖ్యనగరం లాహోర్‌తో సహా పలు పట్టణాలు చీకటిమయమయ్యాయి.  

దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామని ఆ దేశ విద్యుత్తు శాఖ మంత్రి ఒమర్‌ అయూబ్‌ ఖాన్‌ తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios