Asianet News TeluguAsianet News Telugu

కరోనా పాజిటివ్ వ్యక్తితో మీటింగ్.. ఇమ్రాన్ ఖాన్ కి పరీక్షలు

ఫైజల్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఫైజల్‌ కరోనా బారిన పడటంతో అప్రమత్తమైన షౌకత్‌ ఖానం మెమోరియల్‌ ఆస్పత్రి వైద్యులు ప్రధానిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. 

Pakistan PM Imran Khan undergoes COVID-19 test after contact with positive case
Author
Hyderabad, First Published Apr 22, 2020, 2:18 PM IST

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి కరోనా వైరస్ భయం పట్టుకుంది. ఆయన తాజాగా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ఎది ఫౌండేషన్‌ చైర్మన్‌  ఫైజస్‌ ఎది ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసి విరాళాన్ని అందజేశారు. 

ఈ క్రమంలో ఫైజల్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఫైజల్‌ కరోనా బారిన పడటంతో అప్రమత్తమైన షౌకత్‌ ఖానం మెమోరియల్‌ ఆస్పత్రి వైద్యులు ప్రధానిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. 

ఇక ఇమ్రాన్‌ ఖాన్‌ ఇందుకు అంగీకరించడంతో ఆయన శాంపిల్స్‌ను సేకరించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి ఆస్పత్రి సీఈఓ మాట్లాడుతూ.. తమ సూచన మేరకు ప్రధాన మంత్రి కరోనా పరీక్షలు చేయించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నెగటివ్‌ ఫలితమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాగా పాకిస్తాన్‌లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 705 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 9214కు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మసీదుల్లో రంజాన్‌ ప్రార్థనలకు ఇమ్రాన్‌ సర్కారు అనుమతినివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios