పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడిలో 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. పుల్వామా దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

తాము కూడా ఉగ్రవాద బాధితులమేనన్నారు. పాకిస్తాన్ మిలటరీ కానీ, ప్రభుత్వం కానీ ఎప్పటికీ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వదని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి వెనుక పాక్ ఉందని ఆరోపించడం సరికాదని, ఆరోపించడం కాదని, వాటికి ఆధారాలు చూపించాలని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

తమ భూభాగంపై భారత్ దాడికి దిగితే.. ఎదురుదాడి తప్పదని ఆయన హెచ్చరించారు. యుద్ధాన్ని ప్రారంభించడం తేలికేనని, కానీ ఆపడం ఎవరి చేతుల్లోనూ ఉండదన్నారు.