UNSC: ఐక్యరాజ్యసమితి సంస్కరణలు సాధ్యమేనని పేర్కొన్న పాకిస్థాన్ మినిస్ట‌ర్ బిలావ‌ల్ భుట్టో జ‌ర్దారీ..  భద్రతా మండలి సభ్యత్వాన్ని విస్తరించడం సరైన సంస్కరణ కాదని ఆయన అన్నారు. 

UNSC membership to India: పాక్ మ‌రోసారి త‌న వ‌క్ర‌బుద్దిని బ‌య‌ట‌పెట్టింది. భార‌త్ తో క‌లిసి ప్ర‌కృతి వైప‌రిత్యాల‌ను ఎదుర్కొవ‌డానికి క‌లిసి న‌డ‌వాల్సిన స‌మ‌య‌మ‌ని పేర్కొన్న ఆ దేశం అప్పుడే.. అంత‌ర్జాతీయంగా భార‌త్ ఎదుగుద‌ల‌ను స‌హించ‌లేక‌పోతోంది. ఈ క్ర‌మంలోనే ఐక్య‌రాజ్య స‌మితో భార‌త శాశ్వ‌త స‌భ్య‌తం విష‌యంలో అడ్డుప‌డుతోంది. ఐక్య‌రాజ్యస‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్ చోటుద‌క్కించుకోవ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలు అడ్డుక‌ట్ట వేసే విధంగా ముందుకుసాగుతోంది. డ్రాగ‌న్ తో క‌లిసి మ‌రో కుట్ర‌కు తెర‌లేపింది. భారత్‌ను రంగంలోకి దించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించే ఎలాంటి సంస్కరణలను అయిన తమ దేశం వ్యతిరేకిస్తుందని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఐక్య‌రాజ్య స‌మితికి చెందిన సూప‌ర్ వ‌ప‌ర్ దేశాలు ఉన్న పీ5 లో భార‌త్ తో పాటు మ‌రికొన్ని దేశాల‌కు చోటుక‌ల్పిస్తూ సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని గ‌త కొంత కాలంగా అభివృద్ది చెందుతున్న దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐరాస భద్రతా మండలి (పీ5)ఐదు శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి. వాటిలో అమెరికా,ర‌ష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్ లు ఉన్నాయి. యూఎన్ఎస్సీలో శాశ్వ‌త స‌భ్య దేశాలు క‌లిపి మొత్తం 15 ఉన్నాయి. అమెరికా, ర‌ష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్ లు శాశ్వ‌త స‌భ్య దేశాలు కాగా, శాశ్వతేతర సభ్యదేశాల జాబితాలో అల్బేనియా, బ్రెజిల్, గబోన్, ఘనా, ఇండియా, ఐర్లాండ్ కెన్యా, మెక్సికో, నార్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. శాశ్వ‌త దేశాల‌కు ఏ తీర్మానం అయిన విటో చేసే అధికారం ఉటుంది. అలాగే, మ‌రికొన్ని ప్ర‌త్యేక అధికారాలు కూడా ఉంటాయి. 

ఈ క్ర‌మంలోనే ఐరాస లో సంస్క‌ర‌లు తీసుకువ‌చ్చి.. యూఎన్ఎస్సీలో శాశ్వ‌త స‌భ్య దేశాలను పెంచాల‌నే డిమాండ్ ఉంది. భార‌త్ కు శాశ్వ‌త స‌భ్య‌త్వం ఇచ్చే విష‌యంలో డ్రాగ‌న్ కంట్రీ మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తున్న‌ది. దాయాది పాకిస్థాన్ కూడా ఇదే విష‌య‌లో ఇప్పుడు క‌లుగచేసుకుంది. డ్రాగ‌న్ పాట‌కు వంతు పాడుతోంది. వాషింగ్టన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బిలావల్ మాట్లాడుతూ.. ఐరాస‌లో సంస్క‌ర‌ణ‌లు సాధ్యమేనని, అయితే భద్రతా మండలి సభ్యత్వాన్ని విస్తరించడం సరైన సంస్కరణ కాదని ఆయన ప‌రోక్షంగా భార‌త్ అవ‌కాశ‌ల‌కు వ్య‌తిరేకంగా గొంతుక‌లిపారు. ఇదే క్ర‌మంలో భారత్‌తో పాటు ఇతర దేశాలతో కలిసి పని చేసేందుకు పాక్ సిద్ధంగా ఉన్న చోట వాతావరణ సంక్షోభం ఒక సమస్యగా ఉంటుందని బిలావల్ అన్నారు. గ్రీన్ ఫైనాన్సింగ్ మెకానిజంను రూపొందించడానికి అభివృద్ధి చెందిన దేశాలను ఒత్తిడి చేయడానికి 10 వాతావరణ ఒత్తిడి దేశాలు ఒకే గొంతుగా మారాలని ఆయన అన్నారు.

ఆయా ప్రయోజనాల‌ కోసం ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేయడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ "నేను ఇప్పటికే ఇచ్చిన అన్ని హెచ్చరికలతో, వాతావరణ మార్పు సమస్యపై మనం కలిసి పనిచేయడం సరైనది. ఈ విషయంలో అమెరికా, చైనా కలిసి పనిచేయాలని నేను కోరినప్పుడు, విభేదాలు ఏమైనా ఉన్నా, ఈ అంశంపై కూడా భారత్‌, పాకిస్థాన్‌లు కలిసి పనిచేయాలని అంగీకరించే నైతిక బలం నాకు ఉండాలి" అని అన్నారు. “మాకు ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ మాకు పరస్పర భాగస్వామి లేరు. అయితే ఏదైనా ఒక ప్రాంతం ప్రధాన ప్రాతిపదికన ఉన్నట్లయితే, పాకిస్తాన్-భార‌త్ మాత్రమే కాదు, ఇతర శక్తులు-ఇతర దేశాలు తప్పనిసరిగా కలిసి ఉండవు - ఇది బహుశా మనం అన్నిటికీ సంబంధం లేకుండా (వాతావరణ మార్పు) పోరాటానికి కృషి చేయవలసిన ఒక సమస్య, ఎందుకంటే మనం చూసినది, మనం అనుభవించినది, నేను నా శత్రువుపై ఇది కోరుకోను" అని అన్నారు.