Asianet News TeluguAsianet News Telugu

భారత ప్రధాని మోదీ సాయం కోరుతున్న పాకిస్తాన్ వాసి.. ఆస్తులు లాక్కున్నారని ఆవేదన.. వైరల్ అవుతున్న వీడియో..

పాకిస్తాన్‌లో (Pakistan) హిందూ మతంతో పాటు ఇతర మైనారిటీ  అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. దాయాది దేశంలో ఇప్పటివరకు హిందూ దేవాలయాల కూల్చివేతల ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు పాక్ ప్రభుత్వ అధికారులు.. హిందువుల ఆస్తులను బలవంతంగా ఆక్రమిస్తున్నారు. దీంతో వారు భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సాయాన్ని కోరుతున్నారు. 
 

pakistan Muzaffarabad azad kashmir people invite pm modi to rescue their properties belong to India
Author
Muzaffarabad, First Published Jan 19, 2022, 1:30 PM IST

పాకిస్తాన్‌లో (Pakistan) హిందూ మతంతో పాటు ఇతర మైనారిటీ  అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. దాయాది దేశంలో ఇప్పటివరకు హిందూ దేవాలయాల కూల్చివేతల ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు పాక్ ప్రభుత్వ అధికారులు.. హిందువుల ఆస్తులను బలవంతంగా ఆక్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆజాద్ కాశ్మీర్‌లోని ముజఫరాబాద్ చోటుచేసుకున్నట్టుగా ఈ వీడియోను పోస్ట్ చేసిన పాకిస్థాన్‌కు చెందిన ప్రొఫెసర్ సజ్జాద్ రజా పేర్కొన్నారు. 

ఈ వీడియో సారంశం ఏమిటంటే.. కొందరు పోలీసు అధికారులు ఓ హిందూ కుటుంబాన్ని (hindu family) ఇంటిని బయటకు తీసుకొచ్చి.. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ కుటుంబం మొత్తం మంచుకురిసే ఈ సమయంలో నిరాశ్రయులుగా రోడ్డుపై పడింది. అధికారులు ఏ మాత్రం కూడా కనికరం చూపకుండా ఆ కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. పోలీసుల చర్యపై బాధిత కుటుంబం.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. అధికారులు తమ ఆస్తులను, భూమిని అప్పగించకుంటే తాము భారతదేశం సాయం కోరాతామని వారు తెలిపారు. 

వీడియోలో.. పోలీసుల చర్యపై బాధిత కుటుంబం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. తన పిల్లలు రోడ్డున పడుతున్నారని కుటుంబ పెద్ద అన్నారు. ఏం జరిగినా ముజఫరాబాద్‌ కమిషనర్‌దే బాధ్యత అని చెప్పారు. అధికారులు తమ భూమిని మాకు ఇవ్వకపోతే.. సహాయం కోసం భారతదేశాన్ని అడుగుతామని తెలిపారు. మోదీ జీ వచ్చి వాటిని సరిదిద్దాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఆ స్థలం తమేదనని చెప్పారు. ఆ భూములు సిక్కులు, ముస్లిమేతరులవని.. ఎవరి తండ్రివి కావని మండిపడ్డారు. భారత ప్రధాని మోదీ.. తమకు ఈ అణచివేత నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

 

ఒకవైపు వాదనలతో ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన సజ్జాద్ రజా చెబుతున్న ప్రకారం.. ‘ఈ కుటుంబం ఇల్లు పోలీసు శిక్షణా పాఠశాల వెనుక ఉంది. ఈ ఆస్తి విషయంలో కొంత గొడవ జరిగింది. ఇంటికి తాళం వేసి ఉన్న వ్యక్తికి అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చినప్పటికీ.. కుటుంబానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా చలిలో కుటుంబం మొత్తాన్ని పోలీసులు రోడ్డుపై వదిలిపెట్టారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించి పలువురు నెటిజన్లు పాకిస్తాన్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ తన పద్దతి మార్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios