సౌదీ రాజుకు పాక్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..?

First Published 22, Feb 2019, 2:02 PM IST
Pakistan MPs Gifted Gold plated Assult Rifle for saudi Prince mohammed bin salman
Highlights

మన ఇంటికి అతిథులు వచ్చి వారు తిరిగి వెళ్లేటప్పుడు పండ్లో, స్వీట్లో ఇచ్చి పంపడం సాంప్రదాయం.. అయితే పాకిస్తాన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి తన అభిమతం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది.

మన ఇంటికి అతిథులు వచ్చి వారు తిరిగి వెళ్లేటప్పుడు పండ్లో, స్వీట్లో ఇచ్చి పంపడం సాంప్రదాయం.. అయితే పాకిస్తాన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి తన అభిమతం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది.

భారత్‌కు రావడానికి ముందు సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆ దేశానికి చెందిన పలువురు ఎంపీలు సల్మాన్‌ను కలిశారు.

తమ దేశానికి వచ్చినందుకు గుర్తుగా ఓ తుపాకీని బహుకరించారు. బంగారు పూతతో తయారైన ఈ గన్‌ని జర్మనీకి చెందిన హెక్లర్ అండ్ కోచ్ తయారు చేశారు. దీనిని ఎంపీ 5 సబ్‌మెషీన్ గన్‌గా వ్యవహరిస్తారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు పాకిస్తాన్‌పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అతిథులకు ఏ పువ్వో, స్వీటో ఇవ్వకుండా తుపాకీ ఇచ్చారంటే వీళ్లు తీవ్రవాదుల కంటే డేంజర్’’ అంటూ పలువురు విమర్శిస్తున్నారు. పాక్ అసలు ఉద్దేశ్యం ఇదేనని.. శాంతి అనేది ఆ దేశ డీఎన్ఏలోనే లేదని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. 

loader