పాకిస్తాన్ లో ఓ ఎంపీ చేసిన చెత్తపని ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇస్లామాబాద్ లో ఓ ఎంపీ 14 యేళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. జమియత్ ఉలేమా ఎ ఇస్లాం నేత, పాక్‌ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ అయూబీ అనే 50 యేళ్ల ఈ ఎంపీ, 14 ఏళ్ల బాలికను నిఖా చేసుకున్నాడు. 

సదరు బాలిక స్థానిక జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంటుంది. ఆ పాఠశాల రికార్డుల ప్రకారం ఆ బాలి 2006 అక్టోబర్ 28న జన్మించినట్లు గా నమోదయ్యింది. దీని ప్రకారం ఆ బాలిక ఇంకా మైనరే. దీంతో స్థానిక మహిళా సంక్షేమ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు దీనిమీద ఫిర్యాదు చేసింది. 

దీంతె రంగంలోకి దిగిన పాకిస్తాన్ పోలీసులు బాలిక పెళ్లి ఉదంతంపై దర్యాప్తు చేశారు. అయితే తాము ఈ పెళ్లి చేయలేదని, తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడం గమనార్హం. 

పాకిస్తాన్ చట్టాల ప్రకారం 16యేళ్లకంటే తక్కువ వయసుండి వివాహం చేసుకుంటే అది చెల్లదు. అంతేకాకుండా ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తారు. చూడాలి మరిప్పుడు ఈ ఎంపీకి ఏ శిక్ష విధిస్తారో.