ఆఫ్ఘన్, పాకిస్థాన్ సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామన్నారు. తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాకిస్థాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు.
ఆప్ఘనిస్తాన్ దేశం.. తాలిబన్లు ఆక్రమించుకున్నారు. వీరి దెబ్బకు ఆ దేశాధ్యక్షుడు కూడా పరారయ్యాడు. దీంతో.. తాలిబాన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారరు. దీంతో.. వీరి బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా. తాలిబాన్లు తాజాగా చేసిన ఓ స్టేట్మెంట్ అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇప్పటి వరకు తాలిబాన్లకు పాక్ సహాయం చేస్తుందనే అనుమానం మాత్రమే ఉండేది. తాజాగా వారు చేసిన కామెంట్స్ నిజమేనని నిరూపిస్తున్నాయి.
పాకిస్థాన్ తమకు రెండో ఇల్లువంటిదని తాలిబన్లు చెప్తున్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామంటున్నారు. భారత దేశంతో మంచి సంబంధాలను కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఆఫ్ఘన్, పాకిస్థాన్ సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామన్నారు. తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాకిస్థాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులు కలిసి ఉన్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని చెప్పారు. ఇరు దేశాల ప్రజలు పరస్పరం కలిసిపోతారన్నారు. పాకిస్థాన్‌తో సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాము స్వాధీనం చేసుకోవడంలో పాకిస్థాన్ పాత్ర ఏమీ లేదన్నారు. తమ వ్యవహారాల్లో పాకిస్థాన్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదన్నారు.
భారత దేశం, పాకిస్థాన్ తమ మధ్య ఉన్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకోవడానికి కలిసి కూర్చుని, చర్చించుకోవాలని ముజాహిద్ అన్నారు. భారత దేశంతో సహా అన్ని దేశాలతోనూ తాలిబన్లు మంచి సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు.
