పాకిస్తాన్‌లో అత్యంత బరువు ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు ఇంటి గోడను బద్దలు కొట్టారు. వివరాల్లోకి వెళితే... పంజాబ్‌లోని సాధికాబాద్ జిల్లా వాసి అయిన హాసన్‌ దేశంలోనే అత్యంత బరువు ఉన్న వ్యక్తి.

అయితే ఒబెసిటీతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యమాల ద్వారా తన బాధను చెప్పుకుంటూ తనకు చికిత్స అందించాలని కోరారు. దీనిపై స్పందించిన పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావెద్ బజ్వా ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

జావెద్‌ను ఆస్పత్రికి తరలించేందుకు గాను అధికారులు హాసన్ ఇంటికి వెళ్లారు. అయితే ఆయన చాలా లావుగా ఉన్న కారణంగా హాసన్ తలుపు గుండా బయటకు వచ్చే పరిస్ధితి లేకపోవడంతో ఆయన ఇంటి గోడను కూల్చి బయటకు తీసుకొచ్చారు.

తొలుత హాసన్‌‌‌‌ను మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం లాహోర్‌లోని షాలిమార్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.