Asianet News TeluguAsianet News Telugu

భారత్‌ దెబ్బకు దిగొస్తున్న పాక్: హఫీజ్ సయీద్ సంస్థలపై నిషేధం

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశానికి ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తొలగించిన భారత్.. పాక్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 200 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది.

pakistan Govt bans hafiz saeed led jud
Author
Islamabad, First Published Feb 22, 2019, 9:09 AM IST

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశానికి ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తొలగించిన భారత్.. పాక్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 200 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది.

నిన్న సాయంత్రం భారత్ మీదుగా పాక్‌కు వెళ్లే నదీ జలాలను నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది. అంతర్జాతీయంగా సైతం పాక్‌ను ఏకాకి చేస్తుండటంతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

భారత్ దూకుడుతో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయిద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా సంస్థతో పాటు, దాని ఛారిటి విభాగం ఫలహ్ ఇ ఇన్‌సానిత్ ఫౌండేషన్‌పై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన సమావేశమైన జాతీయ భద్రతా కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జమాత్ ఉద్ దవా నెట్‌వర్క్‌లో 300 స్కూళ్లు, హాస్పిటళ్లు, అంబులెన్స్ సర్వీస్‌ మొదలైనవి ఉన్నాయి.

ఈ రెండు గ్రూపుల్లో 50 వేల మందికి పైగా వలంటీర్లు, ఉద్యోగులు ఉన్నారు. హఫీజ్ సయిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా అతని తలపై భారీ వెలకట్టింది. 2017లో అతనిని పాక్ ప్రభుత్వం గృహనిర్బంధం నుంచి విడుదల చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios