పాక్‌ ఎన్నికల్లో అపశృతి. క్వెట్టాలో భారీ పేలుడు.. 30 మంది మృతి

pakistan general elections.. blast in quetta
Highlights

పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ విషాదం చోటు చేసుకుంది.. క్వెట్టాలో భారీ పేలుడు సంభవించింది. ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది.

పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ విషాదం చోటు చేసుకుంది.. క్వెట్టాలో భారీ పేలుడు సంభవించింది. ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది.. పోలింగ్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడేందుకు అక్కడికి వచ్చాడు. అయితే అతన్ని పోలీసులు అడ్డుకుని ప్రశ్నిస్తుండగా.. ముష్కరుడు తనను తాను పేల్చేసుకున్నాడు...

దీంతో పెద్దశబ్ధంతో అక్కడ పేలుడు సంభవించింది. క్షణాల్లో ఆ ప్రాంతమంతా మృతదేహాలతో.. తెగిపడిన శరీర భాగాలతో నిండిపోయింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు పోలీసులు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లు భయాందోళనలకు గురై పరుగులు పెట్టారు..

రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.. డాగ్ స్వ్కాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టి... పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నాయి. పేలుడు దృష్ట్యా సార్వత్రిక ఎన్నికల జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా సైన్యాన్ని మోహరించారు.

loader