జైల్లో నవాజ్ షరీఫ్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలించకపోతే కష్టమే: వైద్యులు

First Published 23, Jul 2018, 11:57 AM IST
Pakistan Ex PM nawaz sharif hospitalized
Highlights

అవినీతి ఆరోపణల కేసులో రావల్పిండిలోని అడియాల జైలులో శిక్షను అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు వైద్యులను పిలిపించి పరీక్షలు జరిపించారు.

అవినీతి ఆరోపణల కేసులో రావల్పిండిలోని అడియాల జైలులో శిక్షను అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు వైద్యులను పిలిపించి పరీక్షలు జరిపించారు. ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని.. రక్తంలో యూరియా, నైట్రోజన్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరాయని.. గుండె వేగంలో తేడా కనిపిస్తుందని.. డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

జైలులో సరైన వసతులు లేనందున షరీఫ్‌ను వేరే ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వానికి వైద్యులు సూచించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత షరీఫ్‌ను వేరే ఆస్పత్రికి తరలిస్తామని జైలు వర్గాలు తెలిపాయి.. అవెన్యూ ఫీల్డ్ కేసులో నవాజ్‌ షరీఫ్‌కు పదేళ్లు.. ఆయన కుమార్తె మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. 

loader