ఇస్లామాబాద్: ఆత్మాహుతి దాడితో భారత ప్రధాని నరేంద్ర మోడీని అంతం చేస్తానని పాకిస్తాన్ సింగర్ రబీ ఫిర్జాదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నరేంద్ర మోడీని హిట్లర్‌గా ఆమె అభివర్ణించింది. సూసైడ్ జాకెట్ ధరించిన ఫోటోను ఆమె ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

గతంలో కూడ ఇదే తరహాలో ఫిర్జాదా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఫిర్జాదా చేసిన వ్యాఖ్యలను భారత నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని సింగర్ ఫిర్జాదా ట్వీట్ ద్వారా తేటతెల్లమైందని భారత నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

పాకిస్తాన్‌ సంప్రదాయ వస్త్రధారణలో చాలా అందంగా ఉన్నావంటూ రబీ తీరుపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. తన పెంపుడు పాములు, మొసళ్లకు భారత ప్రధాని నరేంద్ర మోదీని విందు చేస్తానంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. 

ఈ ఏడాది సెప్టెంబర్  మాసంలో ఈ వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ఆమె పాములను పెంచుతున్నట్టుగా ప్రకటించింది.అయితే పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్  ఆమె మీద చర్యలు తీసుకొనేందుకు ముందుకు వచ్చినట్టుగా పాకిస్తాన్ కు చెందిన జియో న్యూస్ సంస్థ  ప్రకటించింది.

ఇదే విషయమై లాహోర్ కోర్టు కూడ ఆమెకు అరెస్ట్ వారంట్‌ను కూడ జారీ చేసినట్టుగా సమాచారం.ఇంత జరిగినా కూడ ఆమె తగ్గలేదు. తన నడుము చుట్టూ బాంబులు పెట్టుకొని ప్రధాని మోడీపై ఆత్మాహుతి దాడికి దిగుతానని ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

also read కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న మోడీ: భారత్ వైపు మాత్రమే ...

also read పాక్ వక్రబుద్ధి: భారత రాయబారికి నోటీసులిచ్చిన పాకిస్తాన్ ...